ఖైరతా బాద్ వినాయకుని ఊరేగింపు - నిమజ్జనం (ఫోటోలు) (వీడియో)

Khairatabad Maha Ganapathi Immersion Video And Photos

05:02 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Khairatabad Maha Ganapathi Immersion Video And Photos

భాగ్యనగరంలో గణపతి నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంగా పదకొండు రోజుల పాటు భక్తులతో పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఉదయం శోభాయాత్రగా బయలుదేరి మధ్యాహ్నం 1:50 గంటలకు క్రేన్ నెంబర్ 5వద్ద నిమజ్జనం అయ్యాడు. చివరి పూజ అనంతరం ఆద్యాత్మిక వాతావరణంలో ఆ మహాగణపతి గంగమ్మ తల్లి ఒడికి చేరాడు. ఖైరతాబాద్ నుంచి అత్యంత వైభవంగా సాగిన వూరేగింపుతో ట్యాంక్ బండ్ కు చేరిన గణనాథుడిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు.అనుకున్న సమయం కంటే ముందే మహాగణపతిని నిమజ్జనం చేశారు.గణపతి బప్పా మోరియా అంటూ ట్యాంక్ బండ్ పరిసరాలు మార్మోగాయి. హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్తజనసంద్రంగా మారిపోయాయి. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ప్రతిష్టించిన స్థలం నుంచి మహాగణపతి నిమజ్జనం వైపునకు తరలివచ్చాడు. ఇతర విగ్రహాలకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు తొలిసారిగా మహాగణపతిని ముందుగానే నిమజ్జనం చేశారు. మహాగణపతి నిమజ్జనం పూర్తి అవడంతో మిగిలిన వినాయక నిమజ్జనాలు ఊపందుకోనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో అనుకున్నట్టుగానే నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.

1/7 Pages

English summary

Hyderabad was know for Vinayaka Chaviti Celebrations. So many people will create different different types of Lord Vinayaka statues and Khairatabad Vinayaka statue was know for its Big Size and here is the video of immersion of Khairatabad Vinayaka.