పోటీకి సై    

Khusboo Says That She Will Contest In Elections

11:46 AM ON 3rd March, 2016 By Mirchi Vilas

Khusboo Says That She Will Contest In Elections

ఒకప్పుడు తన అందచందాలతో ప్రేక్షకుల మతి పోగొట్టడమే కాక, రాజకీయ రంగంలో కాలు పెట్టి , ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్‌ ప్రచార ప్రతినిధి గా వున్న నటి ఖుష్పూ... ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి సై అంటోంది. ' పార్టీ అధిష్ఠానవర్గం అవకాశం కల్పిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా' అని చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయాలని కోరుతూ పార్టీకి చెందిన పలువురు తన తరఫున దరఖాస్తులు చేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పింది. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తేనే పోటీచేస్తానంది. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ను కాంగ్రెస్‌ కూటమిలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పొత్తు పై ఆయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, కాంగ్రెస్‌ కూటమిలో ఆయన చేరాలనే తాను ఎదురుచూస్తున్నానని , రాష్ట్రంలో అవినీతి అన్నాడీఎంకే పాలనను అంతమొందించేందుకే కాంగ్రెస్‌ పార్టీ డీఎంకేతో పొత్తుపెట్టుకుందని ఆమె వివరించింది. ఇక కార్తీ చిదంబరం పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఇదంతా కేంద్రంలోని ఎన్డీయే కక్షసాధింపు చర్యగా భావిస్తున్నామని ఆమె అంటోంది. బీజేపీ ఓ పథకం ప్రకారం కాంగ్రెస్‌ పై అవినీతి ఆరోపణలు చేస్తోందని కూడా ఆమె విమర్శించింది.

English summary

Actor and Politician Khushboo says that she will defenately contest in upcoming Tamilnadu elections if Congress Party said to Contest.