తమిళ కాంగ్రెస్ సారధ్యం ఈమెకేనా!

Khushboo Says That She was ready for TNCC President

10:58 AM ON 14th July, 2016 By Mirchi Vilas

Khushboo Says That She was ready for TNCC President

అలనాటి హీరోయిన్, రాజకీయ నేత కుష్బూకు మంచి రోజులు వచ్చాయని తమిళతంబీలు అంటున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కుష్బు, తమిళనాడు కాంగ్రెస్ లో కీలకనేత అయ్యారు. ఐతే, ఇటీవల తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలయ్యింది. దీనికి బాధ్యత వహిస్తూ ఆ రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవికెఎస్ ఎలాన్గోవన్ తన పదవికి రాజీనామా చేసి.. లేఖను పార్టీ అధినేత్రి అధ్యక్షురాలికి అందజేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూను టీఎన్ సీసీ అధ్యక్షురాలిగా నియమించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో ఆమె భేటీ అయ్యారు. మరి నేతల మధ్య ఏఏ విషయాలపై చర్చలు జరిగాయో తెలీదుగానీ, ఆమెకు తమిళనాడు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి.

ఎట్ ప్రజెంట్ హోదాకు తగ్గ నేతను, అన్నివిధాలుగా ఆలోచించే వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. టీ.అధ్యక్ష రేసులో ఉన్న పీటర్ అల్ఫోన్స్ , వసంతకుమార్ , సుదర్శన్ నాచ్చియప్పన్ , కుమరిఅనంతన్ లను ఇటీవల రాహుల్ హస్తినకు పిలిపించి మాట్లాడిన విషయం తెల్సిందే! మరోవైపు కాంగ్రెస్ పెద్దలతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఖుష్బూ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో నార్మల్ గానే భేటీ అయ్యానని, తనకు టీఎన్ సీసీ అధ్యక్షురాలి పదవిని ఇస్తే స్వీకరిస్తానని అన్నారు. అయితే అందుకు తగ్గ నేతలు చాలామంది పార్టీలో ఉన్నారని చెప్పారు. మొత్తానికి కుష్బూ కి కాంగ్రెస్ నాయకత్వం అప్పగిస్తే భలే రంజుగా వుంటున్నది అంటున్నారు తమిళ తంబీలు.

ఇవి కూడా చదవండి:కిడ్నీ దానం చేసి ప్రియుడిని రక్షించుకున్న ప్రేయసి!

ఇవి కూడా చదవండి:అక్కా తమ్ముడు దూకుడు..

English summary

Film actor and Political Leader Khushboo said that she was ready to work as TNCC president in Tamilnadu. Yesterday She met AICC President Sonia Gandhi and Rahul Gandhi.