కరీనా తెగించేసింది...సైఫ్ కూడా సరేనన్నాడు..

Ki and Ka movie trailer

10:01 AM ON 16th February, 2016 By Mirchi Vilas

Ki and Ka movie trailer

ముద్దు సన్నివేశాల్లో , ఎక్స్ పోజింగ్ లో కొందరు హీరోయిన్లు అస్సలు అభ్యంతరం చెబుతారు. కొందరైతే ఎలాంటి సన్నివేశా నికైనా రెడీ అంటారు. ఇక పెళ్లికి ముందు ముద్దు సన్నివేశాల్లో నటించడానికి ఎలాంటి ఇబ్బంది ఫీలవ్వని హీరోయిన్లు చాలామందే కనిపిస్తారు. మరి పెళ్లైన తర్వాత కూడా ముద్దులు, రొమాంటిక్‌ సన్నివేశాలలో వలదంటే వలదనే భామలు సైతం వున్నారు. ఇలాంటి గట్టి నిర్ణయం తీసుకున్న హీరోయిన్లలో కరీనా కపూర్ వుంది. 2012లో సైఫ్‌ అలీఖాన్‌తో వివాహమయ్యాక కరీనాకపూర్‌ ఇదే నిర్ణయం తీసుకొందట. కానీ ఇప్పుడు ఆ నియమం జాంతా నై అనేసింది. అన్నీ పక్కన పెట్టేసినట్టే రొమాంటిక్ గా దూసుకు పోతున్నట్లు వుంది. ఎందుకంటే కరీనాకపూర్‌, అర్జున్‌కపూర్‌ జంటగా ఆర్‌.బాల్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కి అండ్‌ క’ చిత్రంలో ఘాటైన ముద్దు సన్నివేశాలో కరీనా నటించింది. ఈ చిత్రంలో అర్జున్‌ ముద్దులు పెట్టిన తీరు కరీనాకు పిచ్చ పిచ్చగా నచ్చేసిందట. ‘కి అండ్‌ క’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం సోమవారం ముంబయిలో జరిగిన సందర్భంగా అర్జున్‌ కపూర్‌ మాట్లాడుతూ ‘‘సీనియర్‌ నటి అనే హోదాను కరీనా ఎప్పుడూ చూపించలేదు’’ అంటూ తెగ మెచ్చేసుకున్నాడు. ఇక కరీనా అయితే ఇంకాస్తా చనువు తీసుకుని, ‘‘నువ్వంటే నాకు ఇష్టం అర్జున్‌! అందుకే నేనో సీనియర్‌ నటిననే మాటే గుర్తు రాలేదు. నువ్వు ముద్దులు పెట్టడంలో సూపర్‌’’అని చెప్పింది. దీంతో అక్కడన్న వాళ్లకు ఆనందం, ఆశ్చర్యం వేసాయట. మరిన్ని ముద్దు సీన్లు చూడాలంటే, ఈ చిత్రం ఏప్రిల్‌ 1వరకు ఎదురుచూడాల్సిందేనా అంటూ అభిమానులు ఫీలయి పోతున్నారట.

ఇది ఇలా ఉంటే కరీనా అర్జున్ కపూర్ ల హాట్ సీన్స్ గురించి తెలుసుకున్న బాలీవుడ్ హీరో కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ కరీనా పై ఆగ్రహం వ్యక్తం చేసాడట. కాని ఇది అంతా సినిమాలో భాగంగానే చేసింది కాబట్టి కరీనాకు సారీ చెప్పిన సైఫ్ భవిష్యత్తులో కుడా ఇలాంటి సీన్స్ చెయ్యడానికి ఓకే చెప్పాడని సమాచారం.

English summary

Recently Ki and Ka movie trailer was released by the movie unit.In this movie Arjun Kapoor and Kareena Kapoor Acted as hero heroines.In this movie there were some lip lock scenes between Arjun Kapoor and Kareena Kapoor.Due this kissing scenes Kareena Husband Saif Ali Khan fired on Kareena and later he said sorry to kareena because of this was a movie.