తీవ్ర అస్వస్ధతలో హీరో సుదీప్

Kiccha Sudeep health sickness

03:57 PM ON 5th July, 2016 By Mirchi Vilas

Kiccha Sudeep health sickness

ఈగ, బాహుబలి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ కన్నడలో హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం హెబ్బులి షూటింగ్ లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం హెబ్బులి షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ లో భాగంగా ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఉదయం నుంచి స్వల్ప అస్వస్థతో ఉన్న సుదీప్ కు సాయంత్రానికి కడుపునొప్పి తీవ్రత అయ్యింది. దీంతో సోమవారం ఆయనను హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రమాదం ఏమీ లేదని గ్యాస్ట్రిక్ సమస్యవల్ల సుదీప్ అస్వస్థతకు గురయ్యాడని యూనిట్ సభ్యులు తెలిపారు. దీంతో షూటింగ్ వాయిదా పడింది.

English summary

Kiccha Sudeep health sickness