కిడిల్.. చిన్నారుల కోసం గూగుల్ ప్రత్యేక సెర్చ్ ఇంజిన్..

Kiddle Search Engine For Kids By Google

05:10 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Kiddle Search Engine For Kids By Google

అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ నూతన సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించింది. కిడిల్ పేరిట విడుదలైన ఈ సెర్చ్ ఇంజిన్‌లో పిల్లలు తమకు సంబంధించిన వెబ్‌సైట్లు, ఫొటోలు, వీడియోలు, వార్తలను వెతికేందుకు అవకాశం ఉంది. 8 నుంచి 10 ఏళ్ల వయస్సు గల పిల్లలకు ఈ సెర్చ్ ఇంజిన్ ఉపయోగంగా ఉంటుందని గూగుల్ చెబుతోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఒక్కోసారి పిల్లలకు అవసరం లేని సెన్సిటివ్ సైట్లు కూడా కనిపిస్తున్నాయని, దీన్నుంచి వారిని దూరంగా ఉంచడం కోసమే కిడిల్ సెర్చ్ ఇంజిన్‌ను తయారు చేసినట్టు వారు తెలియజేసింది. దీన్ని పిల్లలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. పిల్లలు దీంట్లో ఏది సెర్చ్ చేసినా వారికి వెబ్‌సైట్లు, క్విజ్‌లు, పద్యాలు, పాటల రూపంలో రిజల్ట్స్ కనిపిస్తాయని తెలిపింది.

English summary

Worlds popular Search Engine Giant Google introduced a new search engine for Kids.The name of that Search engine was "KIDDLE".With the use of this search engine the user dont get Sensitive information.