కిడ్నాప్‌ అయిన బాలుడు దారుణ హత్య

Kidnapped Boy Found Dead In Visakhapatnam

12:37 PM ON 2nd May, 2016 By Mirchi Vilas

Kidnapped Boy Found Dead In Visakhapatnam

విశాఖ జిల్లాలోని అనకాపల్లి మండలం, గౌరపాలెంలో బాలుడు కిడ్నాప్‌ అంశం విషాదం నింపింది.బాలుడి మృత దేహం కొప్పాక దగ్గర ఏలేరు కాలవలో వెలుగుచూసింది. 24 గంటల కిత్రం గౌరపాలెంకు చెందిన బాలుడు ఉదయ్‌ స్కూల్‌కు వెళ్లి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం ఏలేరు కాలవలో బాలుడి మృతదేహం లభ్యం అయిన విషయం తెలియడంతో బాలుడు తల్లిదండ్రులు, పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి.. ఆ బాలుడు ఉదయ్‌ అని గుర్తించారు.

ఇవి కూడా చదవండి:నా పని అయిపోయిందన్న ఒబామా

శనివారం కిడ్నాప్‌ చేసిన ఉదయ్‌ను దుండగులు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మాట్లాడిన ఫోన్‌ కాల్‌ సిమ్‌ అధారంగా పోలీసులు వారిని గుర్తించి, శనివారం గౌరపాలెంకు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు.అయితే ఇది కేవలం ఆకతాయిగా, డబ్బులు కోసం చేశామని, తమ వద్ద బాలుడు లేడని, శేఖర్‌ అనే వ్యక్తి తీసుకువెళ్లాడని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం బాలుడు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు, బంధువుల్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. పోలీసులు శేఖర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి:బస్సులో దొంగకి కాలితో కిక్ ఇచ్చిన మహిళ(వీడియో)

ఇవి కూడా చదవండి:శివాజీ రాజద్రోహం - పోలీసులకు ఫిర్యాదు

English summary

A 7 Year old boy named Uday in Anakapalli in Vishakapatnam District was kidnapped by unknown people on Friday and the kidnappers demanded his parents for 1 lakh.Uday found murdered in the canal near to Anakapalli. Police filed case on this incident and Searching for the Accused persons in this incident.