చిన్నారి మరణం 'కిక్'ను మార్చింది

Kik App New Terms And Condition

12:19 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Kik App New Terms And Condition

ఓ చిన్నారి ఆకస్మిక మరణం.. ప్రముఖ మెసెంజర్‌ యాప్‌లో మార్పులకు కారణమైంది. స్మార్ట్ ఫోన్ మెసేజింగ్‌ యాప్‌.. 'కిక్‌' ద్వారా ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకోవచ్చు. వాట్సాప్ మాదిరిగానే ఒకేసారి ఒకరితో లేదా.. గ్రూప్‌ చాటింగ్‌ చేయవచ్చు. ఈ యాప్‌ ఉపయోగించే వ్యక్తిని వారు పెట్టుకున్న కల్పిత యూజర్‌ నేమ్ ద్వారా మాత్రమే గుర్తించే వీలుంటుంది. అయితే.. వర్జీనియాకు చెందిన 13 ఏళ్ల బాలిక ఇటీవల అకస్మాత్తుగా మృతిచెందింది. ఆ బాలిక ఓ 18 ఏళ్ల యువకుడితో 'కిక్‌' యాప్‌లో చాటింగ్‌ చేసేదని తెలిసింది. ఆ బాలిక మృతిచెందడానికి ఆ యాప్‌ కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ యాప్‌ పై ఆరోపణలు రావడంతో.. కంపెనీ నివారణ చర్యలు చేపట్టింది. తమ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా తల్లిదండ్రుల కోసం మార్గదర్శకాలు ఏర్పాటు చేసింది. 13 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వాళ్లు ఈ యాప్‌ని ఉపయోగించకుండా ఉండేలా చర్యలు తీసుకుంది. 13 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులంతా ఈ యాప్‌ని తల్లిదండ్రుల సమక్షంలోనే ఉపయోగించాలని సూచించింది. యాప్‌ వినియోగం పై తల్లిదండ్రులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

English summary

A 13-year-old girl who was found dead may have met the Virginia Tech student charged with her murder on anonymous messaging app Kik.The app allows users to only be identified by their usernames. However, third party websites allow users to search for others by age and gender – making the app particularly attractive to pedophiles and predators and the bane of law enforcement.