న్యూఇయర్‌ కి 'కిల్లింగ్‌ వీరప్పన్‌'

Killing Veerappan on January 1st

03:30 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Killing Veerappan on January 1st

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'కిల్లింగ్‌ వీరప్పన్‌'. వీరప్పన్‌ని చంపే పోలీసాఫీసర్‌గా కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌ ఇందులో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి ఈ చిత్రం పై అభ్యంతరం తెలుపడంతో విడుదల ఆగిపోయింది. అయితే ఆ అవాంతరాలను అధిరోహించి రామ్‌గోపాల్‌ వర్మ ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 18న (ఈరోజు) విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అయితే మళ్లీ తాజాగా కొన్ని సమస్యల కారణంగా చిత్రం విడుదలని వాయిదా వేశారు.

న్యూఇయర్‌ కానుకగా జనవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2000 ధియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సందీప్‌ భరద్వాజ్‌, పారుల్‌ యాదవ్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం జనవరి 1న అయినా విడుదలవుందేమో చూడాలి.

English summary

Killing Veerappan on January 1st. Kannada Superstar SivaRaj Kumar is acted as a police officer in this film. Ram Gopal Varma is directed this movie.