వీరప్పన్‌కు లైన్‌ క్లియర్‌

Killing Verappan releasing on Decmber 11th

06:20 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Killing Verappan releasing on Decmber 11th

దక్షిణ భారతదేశంలోని పోలీసులను ముచ్చెమటలు రప్పించిన స్మగ్లర్ వీరప్పన్‌ను చంపిన ఒక పోలీస్‌ ఆఫీసర్‌ కథతో తెరకెక్కిన చిత్రం కిల్లింగ్ 'వీరప్పన్'. ఈ చిత్రం రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించగా పోలీస్‌ ఆఫీసర్‌గా కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్‌ నటించారు. అయితే ఈ చిత్రం డిసెంబర్‌ 4న విడుదల కావాల్సి ఉండగా వీరప్పన్‌ భార్య అభ్యంతరం తెలపడంతో సినిమా రిలీజ్‌ వాయిదా పడింది. అయితే రామ్‌గోపాల్‌ వర్మ స్వయంగా వీరప్పన్ భార్య అయిన ముత్తులక్ష్మిని స్నేహపూర్వకంగా కలసి చర్చలు జరిపాడు. ఆమె అడ్డు తొలగిపోవడంతో ఇప్పడు విడుదలకు ఎటువంటి ఆటంకాలు లేవు.

ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ డిసెంబర్‌ 11న తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో 2000 ధియేటర్లలో విడుదల చేస్తున్నామని ప్రకటించారు.

English summary

Killing Verappan releasing on Decmber 11th. In this movie Kannad Superstar Siva Rakkumar acted as a police officer.