ముద్దుల చెల్లెలు పెళ్లికి దిమ్మతిరిగే కండీషన్ ...

Kim Jong un Conditions To Marry His Sister

03:44 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Kim Jong un Conditions To Marry His Sister

తప్పుదాది పడుతుంటే సరిదిద్ది, చెల్లెలు పెళ్లి ఘనంగా చేయాలని ఏ సోదరుడైనా తాపత్రయం పడడం సహజమే కదా. తనకు కాబోయే బావ మంచీ..చెడూ విచారించి మరీ వివాహం నిశ్చయం చేస్తారు. కానీ ఈయన రూటు రివర్స్ ... తమ సోదరిని పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ఆమెతో డేటింగ్ చేయాలని, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ కండిషన్ పెట్టారు. తాజాగా తన ముద్దుల చెల్లెలు కిమ్ యో జోంగ్ పెళ్లి విషయంలో కూడా తనదైన స్టైల్ చూపించారు. తన చెల్లెకి వరుడు కావాలంటూ స్వయంవరం ప్రకటించారు.

అయితే తన సోదరి పెళ్లి విషయంలో కిమ్ పెట్టిన కండిషన్లు వినగానే జనానికి మతిపోయింది. వరుడు కచ్చితంగా బ్రహ్మచారి అయి ఉండాలని, ఫ్యూ యాంగ్లోని కిమ్ టు సన్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొందిన వారై ఉండాలని, 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉండాలని, ఉత్తర కొరియా ఆర్మీలో పనిచేసి ఉండాలని కిమ్ కండిషన్లు పెట్టారు. అంత వరకు బానే వున్నా, అసలైంది వింటే దిమ్మతిరిగిపోయింది. తన సోదరిని వివాహం చేసుకోవాలంటే పెళ్లికి ముందు ఆమెతో డేటింగ్ చేయాలని ప్రకటించారు. అంతేకాదు డేటింగ్కు ఆమెను ఒప్పించాలని కండిషన్ కూడా పెట్టారు. ఆ షరతులకు ఇష్టపడి జోమ్ను పెళ్లి చేసుకునేందుకు దాదాపు 30 మంది యువకులు సిద్ధమయ్యారు. అధ్యక్ష భవనానికి తమ అఫ్లికేషన్లు పంపారు. అయితే అందరికి జోమ్తో మాట్లాడే అవకాశం దక్కదని, ధరఖాస్తులు పరిశీలించి వారిలో ఎంపిక చేసిన వారితోనే జోమ్ మాట్లాడుతుందని, అందులో నచ్చిన వారితోనే డేటింగ్ అని, ఆ తర్వాత ఫైనల్ నిర్ణయం జరుగుతుందని చెబుతున్నారు. భలే అన్నగారే అంటూ పలువురు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి:సెక్సీగా ఉందంటూ సొంత దేశంలోనే ఆమె యాడ్ బ్యాన్(వీడియో)

ఇవి కూడా చదవండి:అబ్బో , ఆ రియాల్టీ షోకి రూ.14 కోట్లా?

English summary

North Korea President Kim Jong Un was announced that the qualities and the conditions to marry his sister. He said that the applicant Should be work in North Korea Army and he should be date with his sister.