వావ్ ...రియాల్టీ స్టార్ నిదోచేసి కరిగించేశారట

Kim Kardashian's stolen jewellery melted: police revealed

12:07 PM ON 30th January, 2017 By Mirchi Vilas

Kim Kardashian's stolen jewellery melted: police revealed

అలా దోచుకుని ఇలా మాయం చేయడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. నగలైనా అంతేకదా. ఇంతకీ విషయం ఏమంటే, అమెరికా టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియాన్‌ను ప్యారిస్ హోటల్లో దోచుకున్న దొంగలు పట్టుబడ్డారు. ఈ గ్యాంగ్‌ను ఫెడరల్ పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. ఆ బంగారు నగల్లో కిమ్‌కు చెందిన ఒక్క ఎంగేజ్మెంట్ రింగ్‌ను తప్ప మిగిలినవాటినన్నింటినీ తాము కరిగించి అమ్మేశామని ఈ గ్యాంగుకు లీడర్ అయిన 60 ఏళ్ళ ఒమర్ ఎయిత్ ఖెదాచే అనే దొంగ చెప్పుకొచ్చాడట.

కిమ్ భర్త కాన్యే వెస్ట్ లోగడ ఆమెకు 3.5 మిలియన్ పౌండ్ల విలువైన ఈ ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. తాము దోచుకున్న జువెల్లరీలో అదొక్కటే మిగిలిందని ఒమర్ తెలిపాడు. ఈ నెలారంభంలోనే ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ అతని వాంగ్మూలాన్ని ఏ కారణం వల్లో రహస్యంగా ఉంచారు. గత ఏడాది అక్టోబరులో ప్యారిస్‌లోని హోటల్లో బస చేసిన కిమ్ కర్దాషియాన్ నిలువు దోపిడీకి గురి అయిన సంగతి తెలిసిందే. తమ ముఠాసభ్యులు బెల్జియంలోని యాంటే వెర్ప్ నగరానికి వెళ్లి అక్కడి ఓ డైమండ్ ట్రేడింగ్ సెంటర్లో ఈ నగలను అమ్మి కరిగించేశారని చెప్పిన ఒమర్.. తమకు ఎంత సొమ్ము ముట్టిందీ వివరించలేదు. ఈ దోపిడీలో మొత్తం సుమారు 9 మిలియన్ పౌండ్ల విలువైన నగలను దొంగలు దోచుకుపోయినట్టు వార్తలు వచ్చాయి.

అయితే కిమ్ ఎంగేజ్మెంట్ రింగ్‌ను కూడా అమ్మేద్దామని అనుకున్నా.. అందులో వాడిన రాయి (స్టోన్) వల్ల సులభంగా ఐడెంటిఫై అయ్యి పట్టుబడిపోతామనే భయంతో అమ్మలేదని ఒమర్ తెలిపాడు. కిమ్‌ను తామెంతో గౌరవప్రదంగా చూసుకున్నామని, ఆమెకు ఎలాంటి హానీ చేయలేదని చెప్పాడు. కిమ్ సోదరుడికి డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆమె కదలికలపై నిఘా పెట్టామని, పకడ్బందీగా తమ ప్లాన్ అమలు చేశామని పేర్కొన్నాడు. ఈ కేసులో ఆరుగురుని అరెస్టు చేసిన పోలీసులు ఓ అనుమానితుడిని వదిలిపెట్టారు

ఇది కూడా చూడండి: కైలాస పర్వతంపై శివుని ఆనవాళ్లు ... బయటపెట్టిన నాసా ... (వీడియో)

ఇది కూడా చూడండి: బాప్ రే , అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయట.?

English summary

America TV reality star Kim Kardashian jewellery was stolen she filed a case on them recently police revealed that kim jewellery was melted down by robbers.