ఐసిస్ తో లింకు... అరెస్ట్ అయిన ప్రముఖ మోడల్ ఎవరో తెలుసా?

kimberly Minors model arrested due to link with ISIS

11:40 AM ON 10th October, 2016 By Mirchi Vilas

kimberly Minors model arrested due to link with ISIS

ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మాఫీయా లీడర్లతో మోడల్స్ కి, కొందరు తారలకు లింకులున్నాయని వింటుంటాం. కొందరు ఈ కేసుల్లో ఇరుక్కున్నారు. ఇక తాజాగా బ్రిటిష్ గ్లామర్ మోడల్ కింబర్లీ మైనర్స్ కి ఐసిస్ తో లింకులున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో లండన్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెకు ఇటీవల ఈ భామ ఇస్లాం మతంలోకి మారిందని ఓ ప్రముఖ దినపత్రిక పేర్కొంది. మతం మారినప్పట్నుంచి ఆమె ఐసిస్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఐసిస్ పోస్ట్ చేసిన వీడియోలను షేర్ చేస్తుండటాన్ని పోలీసులు గమనించారు. పలుమార్లు ఆమెకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చి పంపారు. అయితే ఆమె మాత్రం వైఖరి మార్చుకోలేదు.

అంతటితో ఆగని ఆమె పాపులారిటి మరింత సంపాదించుకునేందుకుగాను ఓ ప్రముఖ దినపత్రికకు గాను అర్ధ నగ్నంగా పోజిచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి ఐసిస్ లో చేరాలంటూ యువతను ఆకర్షించేదట. ఇలా చేస్తున్న ఈమెను బ్రిటన్ యాంటీ టెర్రరిస్టుగా పోలీసులు గుర్తించి ఉగ్రవాద నిరోధక చట్టం-2000 కింద ఇటీవల అరెస్ట్ చేశారు. ఆమెను విచారించి ఇంట్లో సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే సోదాల్లో ఏమైనా వస్తువులు చిక్కాయా లేదా అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. అనంతరం పోలీసుల విచారణలో ఈ మోడల్ మాత్రం.. నేను సోషల్ మీడియాలో ఐసిస్ ను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు.. నేను తీవ్ర వాదులకు వ్యతిరేకమంటూ బుకాయిస్తోందని పోలీసులకు ఆమె సమాధానం ఇచ్చినట్లు సమాచారం. నా పేరుతో ఎవరో నకిలీ అకౌంట్ తయారు చేసి నన్ను బలి చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అయితే బ్రిటన్ లో మోడల్ గా మంచి పేరున్న మైనర్స్ కు ఐసిస్ తో సంబంధాలున్నాయని టాక్ రావడంతో కలకలం రేపుతోంది.

English summary

kimberly Minors model arrested due to link with ISIS