వంటవాడిగా మారిన భూటాన్ రాజు

King of Bhutan turned as a chef for school children

10:29 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

King of Bhutan turned as a chef for school children

ఇక్కడ ఓ వ్యక్తి కూర్చుని ఉల్లిపాయలు తరుక్కుంటున్నాడు. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఇక్కడ ఉల్లిపాయలు తరుగుతున్నదెవరో తెలిస్తే కచ్చితంగా షాకవ్వాల్సిందే. ఆయన ఓ దేశానికి రాజు కావడం విశేషం. తన స్థాయిని పక్కనబెట్టి ఓ స్కూల్ పిల్లలకు స్వయంగా వంట చేసి పెట్టాడతను. రాజరిక పాలన సాగే భూటాన్ ను నడిపిస్తున్న జిగ్మె వాంగ్ చుక్, కొన్ని నెలల కిందట ఇండియాలో తన సతీమణితో కలిసి పర్యటించాడు కూడా. ఈ మధ్య మోంగార్ ప్రాంతంలోని ఓ పాఠశాలకు వెళ్లిన వాంగ్ చుక్.. ఏకంగా వంటవాడి అవతారం ఎత్తాడు.

ఊరికే అలా ఫోటోలకు ఫోజిచ్చి ఏదో ఒక కూరగాయను కట్ చేసి వెళ్లిపోకుండా ప్రొఫెసనల్ చెఫ్ లాగా మారిపోయి తనే స్వయంగా కూరగాయలు తరిగి.. వంటచేసి పిల్లలకు వడ్డించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. రాజరికమే అయినా.. వాంగ్ చుక్ పాలన విషయంలో భూటాన్ ప్రజలు చాలా సంతోషంగానే ఉన్నారు. మొన్న ఫిబ్రవరి 5న వాంగ్ చుక్ కు కొడుకు పుట్టాడని వాంగ్ చుక్ దేశవ్యాప్తంగా లక్షా 8 వేల చెట్లు నాటించాడు. దేశ ప్రజలందరూ కూడా రాకుమారుడి జననాన్ని ఓ పండగలాగా జరుపుకుంటూ రాజు ఆదేశాల మేరకు చెట్లు నాటారు. తాజాగా స్కూల్ పిల్లలకు వంట చేసి పెట్టిన ఉదంతంతో మరోసారి వార్తల్లోకి ఎక్కిన వాంగ్ చుక్ కి నెటిజన్లు వీరలెవెల్లో కామెంట్స్ కొట్టేస్తున్నారు.

English summary

King of Bhutan turned as a chef for school children