పుదుచ్చేరి గవర్నర్ గా కిరణ్ బేడీ

Kiran Bedi elected as a Puducherry governor

02:58 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Kiran Bedi elected as a Puducherry governor

తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా రికార్డు సృష్టించిన, బీజేపీ నాయకురాలు కిరణ్ బేడి పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. 1972 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన కిరణ్ బేడి కేంద్రంలో పలు కీలక పోస్టులు నిర్వహించారు. ఆసియాలోనే అతిపెద్ద కారాగారమైన తీహార్ జైలుకు ఐజీగా కిరణ్ బేడీ సమర్ధవంతంగా పనిచేసారు. ఆమె చేసిన ప్రజాసేవకు రామన్మెగసెసె అవార్డు కూడా వరించింది. అయితే తన పదవీవిరమణ తర్వాత కిరణ్ బేడీ అన్నా హజారే - అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి లోక్పాల్ బిల్లు కోసం పోరాడారు. ఆ తర్వాత బీజేపీలో చేరి 2015 ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగారు.

అయితే తను పోటీ చేసిన కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి కిరణ్ బేడి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఈ మాజీ ఐపీఎస్ అధికారిణి క్రియాశీల రాజకీయాలకు ఒకింత దూరంగానే వుంటున్నారు. తాజాగా జరిగిన నామినేటెడ్ పోస్టుల నియామకంలో భాగంగా కిరణ్ బేడీకి గవర్నర్ పీఠం దక్కింది. పుదుచ్చేరికి మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సంగతి తెల్సిందే.

English summary

Kiran Bedi elected as a Puducherry governor