భర్తను కోల్పోయిన  కిరణ్ బేడీ

Kiran Bedi Husband Passes Away

04:32 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Kiran Bedi Husband Passes Away

దేశంలో మొదటి మహిళా ఐపీఎస్‌ అధికారి, సామాజిక కార్యకర్త, బిజెపి నేత కిరణ్‌బేడీ భర్త బ్రిజ్‌ బేడీ గుడ్‌గావ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు. ఆయనకు ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. మంచి చిత్రకారుడు కూడా. డెబ్భైఆరేళ్ల బ్రిజ్‌ అమృత్‌సర్‌లో ఓ పాఠశాల ప్రారంభించి 600మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. మూత్రాశయం, మూత్రపిండాల క్యాన్సర్‌తో బాధపడుతున్న బ్రిజ్‌ ఐదు నెలల నుంచి డిల్లీ ,అమృత్‌సర్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈనెల 28న దిల్లీలోని మేదాంత-మెడిసిటీ ఆసుపత్రిలో అత్యవసర సేవల విభాగంలో చేరిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. భర్త మరణంపై కిరణ్‌బేడీ ఆవేదన వ్యక్తం చేస్తూ ‘అమృత్‌సర్‌ నగరం తనను అమితంగా ప్రేమించే వ్యక్తిని కోల్పోయింది. ఆపన్నులను ఆదుకోవడానికి బ్రిజ్‌ జీవితాంతం తపించారు.. మేం ఆయన ఆశయాన్ని కొనసాగిస్తాం’ అని ట్వీట్‌ చేశారు. ‘నగరాన్ని అత్యుత్తమ నివాసకేంద్రంగా మార్చడానికి తను శాయశక్తులా ప్రయత్నించారు. మత్తుమందుకు బానిసై ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల బాగు కోసం అహర్నిశలు శ్రమించారు. పలు సమస్యలపై ధైర్యంగా గొంతెత్తారు’ అని భర్త సేవలను స్మరించుకున్నారు. పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతూ , కిరణ్ బేడీకి ప్రగాడ సానుభూతి తెల్పారు.

English summary

India's first IPS officer Kiran Bedi's husband Brij Bedi was died in delhi due to heart attcak.Due to some cancer disease he joins in hospital before five months.This news was tweeted by Kiran Bedi on her twitter account