ఎమ్మెల్యే కాళ్లకు మొక్కిన గవర్నర్ కిరణ్ బేడీ ... షాకింగ్ న్యూస్

Kiran Bedi touches feet of Congress MLA

11:10 AM ON 8th June, 2016 By Mirchi Vilas

Kiran Bedi touches feet of Congress MLA

నీతికి.. నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచే పేరున్న మాజీ ఐ పీఎస్ అధికారిని కిరణ్ బేడీ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఈ మధ్యనే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెల్సిందే. అయితే వ్యక్తిపూజ ఎక్కువగా ఉండే చోట.. అందుకు భిన్నంగా వ్యవహరించిన ఈమె కార్యక్రమానికి వచ్చిన వారందరికి షాకిచ్చారు. ఇప్పటికే తన మార్క్ నిర్ణయాలతో వ్యవహరిస్తున్న ఆమె.. తాజాగా ఆమె వ్యవహార శైలి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే, ఇటీవల పుదుచ్చేరి ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన పుదుచ్చేరి ఎమ్మెల్యేలు ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకునేందుకు వచ్చి అభినందనలు తెలిపారు. అక్కడితో ఆగని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే విజయవేణి గవర్నర్ హోదాలో ఉన్న కిరణ్ బేడికి శాలువా కప్పి పాదాభివందనం చేశారు. మామూలుగా అయితే ఇలాంటి వాటికి పెద్దగా స్పందించని వైనం చాలామంది పెద్దల్లో చూస్తాం. అందుకు భిన్నంగా ఇలా కాళ్లు పట్టుకోవటం వద్దని వారించిన కిరణ్ బేడీ..ఆత్మగౌరవంతో బతకాలని.. ఎవరి కాళ్లు పట్టుకోకూడదన్న ఉపదేశం ఇచ్చిన ఆమె కూడా సడన్ గా సదరు ఎమ్మెల్యేకు తాను కూడా పాదాభివందనం చేశారు.

ఊహించని ఈ పరిణామానికి సదరు ఎమ్మెల్యేతో సహా కార్యక్రమానికి హాజరైన వారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. లెఫ్టినెంట్ హోదాలో ఉన్న కిరణ్ బేడీ స్వయంగా తన కాళ్లకు మొక్కటాన్ని సదరు ఎమ్మెల్యే జీర్ణించుకులేక ఖంగుతిన్నారు. వీఐపీలు.. రాజకీయ నేతల కార్లకు సైరన్లు ఉండకూడదంటూ ఆదేశాలు జారీ చేయటంతో పాటు.. ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ పాటించాలని.. ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దంటూ ఆదేశాలు ఇచ్చిన కిరణ్ బేడీ, కేంద్రప్రాలిత ప్రాంతంలో వ్యవహరించిన ఈ తాజా తీరు చర్చకు దారితీసింది.

ఇది కూడా చూడండి:33 ఏళ్ళ వయసులో కూడా తరగని అందం(ఫోటోలు)

ఇది కూడా చూడండి:దిష్టి మంత్రం గురించి తెలిస్తే షాకవుతారు!

ఇది కూడా చూడండి:బీరుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా!

English summary

Kiran Bedi touches feet of Congress MLA.