మౌనం వీడనున్న కిరణ్

Kiran Kumar Reddy Name In Jairam Ramesh Book

11:07 AM ON 21st June, 2016 By Mirchi Vilas

Kiran Kumar Reddy Name In Jairam Ramesh Book

రెండేళ్లకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ పక్క ప్రత్యేక, మరోపక్క సమైక్య ఉద్యమాలు జోరుగా సాగుతుంటే, సమైక్యం వైపు నిలబడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇన్నాళ్లూ మౌనంగా వున్నారు. అయితే ఇప్పుడు ఆయన మౌనం వీడబోతున్నారని ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నారు. రేపోమాపో ఆయన మీడియా ముందుకు రావచ్చన్నది ఫ్లాష్ ఫ్లాష్. రాష్ర్ట విభజన జరిగి రెండేళ్లు అయ్యింది. ఈ గ్యాప్ లో ఆయన ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చిన సందర్భం లేదు.

ఆ మధ్య రాజమండ్రిలో జరిగిన ఒక ఈవెంట్ లో కేకేఆర్ ఓ మెరుపు మెరిసినా ఆ తర్వాత ఆయన ఛాయలు ఎక్కడా లేవు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మౌనం వీడటానికి కారణాలేంటి? అని ఆరా తీస్తే, రీసెంట్ గా ఏపీ విభజన నేపథ్యంతో కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఓ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. విభజన వ్యవహారంలో ఆనాటి సీఎం కిరణ్ గురించిన ప్రస్తావన కూడా ఆ పుస్తకంలో తీసుకొచ్చారు. విభజనపై తన విముఖతను సోనియా సమక్షంలో మొరపెట్టుకున్నా కిరణ్ మాటను అధిష్టానం లెక్కలోకి తీసుకోలేదని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే కేకేఆర్ తన మౌనాన్ని వీడతారని కొందరు రాజకీయ నేతల అంచనా! తను మీడియా ముందుకు రావడానికి అదను కోసం ఎదురుచూస్తున్న కిరణ్ కి ఓ బలమైన కారణం ఈ విధంగా పుస్తక రూపంలో దొరికిందని అంటున్నారు. ఇన్నాళ్లూ వేచి చూస్తున్న కిరణ్ కుమార్ రెడ్డికి ఇదొక మంచి అవకాశంగా కూడా వాళ్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే జైరాం రమేష్ తన బుక్ లో విభజనకు అన్ని పార్టీలు సహకరించాయని చెప్పుకొచ్చారు. ఇక కిరణ్ మౌన ముద్ర వీడితే మరింత రంజుగా ఉంటుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:బాంబు లు తయారీ సంస్థలకు బ్యాంక్ లోన్లు?

ఇవి కూడా చదవండి:సభ అంటే స్నాక్స్ తినేసి పోవడం కాదన్న లేడీ ఎం ఎల్ ఏ (వీడియో)

English summary

United Andhra Pradesh Last Chief Minister Nallari Kiran Kumar Reddy was disappeared after the state intersection and now his name was written in Congress Party leader Jai Ram Ramesh's book and in that book he said that Sonia Gandhi was neglected Kiran Kumar Reddy's words during State intersection.