తనదే తప్పు , కెసిఆర్ సూపర్ అంటున్న కిరణ్ !!

Kiran Kumar Reddy Praises KCR

12:27 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Kiran Kumar Reddy Praises KCR

అవునా, అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తగదని , రాష్ట్రం విడిపోతే ఎన్నో సమస్యలు వస్తాయని ఎప్పటికకప్పుడు కౌంటర్ ఎటాక్ ఇస్తూ వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ గురించి కూడా అప్పట్లో హెచ్చరికలు చేసారు. అయితే ఉన్నట్టుండి తెలంగాణా సిఎమ్ కెసిఆర్ ని కిరణ్ మెచ్చుకుంటున్నారంటే ఆశ్చర్యమే కదా. ఇంతకీ ఏ విషయంలో ఎలా మెచ్చుకున్నారో తెల్సుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే. క్రియాశీల రాజకీయాల నుంచి తెరమరుగు అయి సరిగ్గా రెండేళ్లు కావస్తున్నప్పటికీ తన దగ్గరివారితో మాత్రం కిరణ్ టచ్లో ఉంటున్నారు. ఎందుకంటే, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయనతో నడిచి అనంతరం ఆయన స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఓ నాయకుడు తాజాగా కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఆ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారో అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన విలేకరులతో ఆ నాయకుడు వెల్లడించారు.

తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ లో లా ఆండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండదని తాను భావించినప్పటికీ ఇపుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదని కిరణ్ కితాబిచ్చారట. అంతే కాకుండా దేశవ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నప్పటికీ కేసీఆర్ పాలనలో హైదరాబాద్ లో పూర్తి భద్రత ఉందని కూడా తనతో పలువురు చెప్తున్నారని కిరణ్ అన్నారట, అంతే కాకుండా తన పరిశీలనలో కూడా అది స్పష్టమైందని కిరణ్ ఆ నాయకుడితో వివరించారు. దీంతో పాటు ఏపీ మంత్రి కుమారుడు ఒకరు చేసిన పని విషయంలో ఒత్తిడికి లొంగి మొహమాటానికి పోయి కేసును నీరుగారుస్తాడని సందేహపడ్డప్పటికీ కేసీఆర్ అలా చేయ కుండా సమర్ధవంతంగా వ్యవహరించారని కూడా కిరణ్ మెచ్చుకున్నారట. అయితే ఎంఐఎం విషయంలో జాగ్రత్తగా ఉంటేనే కేసీఆర్ కలలుగంటున్న విశ్వనగరం కల నెరవేరుతుందని సదరు నాయకుడితో కిరణ్ స్పష్టంగా అభిప్రాయపడ్డారట. మొత్తం మీద కిరణ్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, విశ్లేషణ కూడా చేయడం విశేషమే. అదే సమయంలో ఎపి పాలన గురించి ఒక్క ముక్క కూడా లేకపోవడం కూడా ఆలోచించ దగ్గదే కదా ..

క్రికెటర్ల జెర్సీ నంబర్ల వెనుక అసలు రహస్యం

రోజాకు సరే , మరి నా సంగతేంటి?

శ్రీసిటీ సెజ్‌లో క్యాడ్‌బరీ చాక్లెట్‌ ఫ్యాక్టరీ

మగాళ్లను రెచ్చిపోయేలా చేసే 9 ఫోర్ ప్లే మూవ్స్ ఇవే..

English summary

United Andhra Pradesh last Chief Minister and Jai Samaikyandhra Party Leader Nallari Kiran Kumar Reddy praises Telangana Chief Minister KCR .