ఫేస్ బుక్ అకౌంట్ పై పోలీస్ కంప్లైంట్...

Kiran Rao Complaints On Fake Facebook Account

11:21 AM ON 6th June, 2016 By Mirchi Vilas

Kiran Rao Complaints On Fake Facebook Account

అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ తన పేరిట ఉన్న ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి తన పేరు మీద ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చాటింగ్ చేస్తున్నాడని ఆమె కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఈ అకౌంట్ ద్వారా తన అభిమానులను, ఫ్రెండ్స్, కుంటుంబ సభ్యులను మోసపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చాటింగ్ లో ప్రస్తావించిన విషయాలను, ఫ్రెండ్స్ ప్రస్తావించగా తనకు అసలు విషయం తెలిసిందని దీంతో వెంటనే జాగ్రత్తపడేందుకే సైబర్ క్రైమ్ స్పెషల్ సెల్ కి ఫిర్యాదు చేసినట్టు కిరణ్ రావ్ తెలిపారు. పోలీస్ కమీషనర్ స్పందిస్తూ, కంప్లైంట్ అందిందని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశామని తెల్పారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ సెలబ్రిటీల పేరిట సోషల్ మీడియాలో అకౌంట్ లు ఓపెన్ చేసి వాళ్ల ఐడెంటిటీని తస్కరించి మోసాలు చేయడం ఈ మధ్య కామన్ గా మారిపోయింది.

ఇవి కూడా చదవండి:వినాయకుణ్ణి అవమానించిన 'అమెజాన్'
ఇవి కూడా చదవండి:అలా చేసి, పోలీసులకు దొరికిపోయిన హీరో

English summary

Bollywood Hero Aamir Khan's wife Kiran Rao was filed a case in Cyber crime police station on the fake facebook account. She said that the account was started on her name and he/she used to chat with her family members and friends.