సైకిలు ఎక్కాం ... దెబ్బతిన్నాం

Kishan Reddy About Tie Up With TDP

12:02 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

Kishan Reddy About Tie Up With TDP

తెలంగాణాలో టిడిపితో కటీఫ్ కి సిద్ధపడిన బిజెపి ఇప్పుడు విశ్లేషణ మొదలు పెట్టింది. పార్టీకి జవసత్వాలు కల్పించే దిశగా పావులు కదుపుతోంది. అసలు పొత్తు ను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి వుంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వల్లే నష్టపోయామని ఆయన పేర్కొన్నారు. పొత్తు వద్దని అప్పుడే అధిష్ఠానానికి చెప్పానన్నారు. స్థానిక నేతల అభిప్రాయానికి వ్యతిరేకంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. బీజేఎల్పీ నేతగా కొత్తవారికి అవకాశం ఇస్తే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో బీజేఎల్పీ నేతగా పదేళ్లు పనిచేశానన్నారు. ఎన్నికల తర్వాత ఏడు మండలాలను ఏపీలో కలపడం కూడా పార్టీకి నష్టం కలిగించిందని ఆయన వివరించారు. శుక్రవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

'గౌతమీపుత్ర’ 200రోజుల సినిమా అన్న కెసిఆర్

ఆ రెస్టారంట్ లో నగ్నంగా కూర్చుని తినొచ్చట

రణ్‌వీర్‌సింగ్‌,వాణీకపూర్‌ ముద్దులే ముద్దులు

English summary

Telangana BJP leader Kishan Reddy Says that BJP lost Many of the Seats in Telangana Because of Pairing with TDP. Kishan Reddy Also Says That he opposes this thing when 2014 elections.