గ్రేటర్ ఎన్నికలంటే గులాబీ బాబులకు హడల్

Kishan Reddy On GHMC Elections

06:27 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Kishan Reddy On GHMC Elections

ఓ పక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుంటే , మరోపక్క అధికార విపక్షాలు వాగ్బాణాలు సంధించుకుంటున్నాయి. పైగా ప్రచారానికి పోలింగ్ కి మధ్య వున్న దూరాన్ని 9 రోజులకే కుదించడం తో పాటూ ,మొత్తం ఎన్నికల షెడ్యూల్ ని కుదిస్తూ , టీ సర్కార్ తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. విమర్సల జడివానలో భాగంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఎన్నికలంటే టిఆర్ఎస్ కి భయం పట్టుకుందని విమర్శించారు. గెలుపుపై ధైర్యం లేకనే రిజర్వేషన్ల ప్రకటనపై ప్రభుత్వం తాత్సారం చేస్తోంద ని ఆయన ద్వజమెత్తారు. ఎన్నికల ప్రక్రియ గడువు కుదింపుతో ప్రతిపక్షాలను ప్రచారం చేసుకోనీయకుండా టి ఆర్ ఎస్ కుట్ర చేస్తోందని ఆయన దెప్పి పొడిచారు. బడుగు బలహీన వర్గాలు, మహిళలకు ప్రచారం చేసుకునే సమయం కూడా ఇవ్వకుండా వ్యవహరించడం, టి ఆర్ ఎస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దొంగదారుల్లో గెలవాలనుకుంటున్న టి ఆర్ ఎస్ పాచిక పారదని ఆయన అన్నారు. ముందు ముందు ఈ విమర్శలు రాజకీయాలను మరింత వేడెక్కించ నున్నాయి.

English summary

BJP leader kishan reddy says comments on trs party. He Says that Trs party was worring about Greater Hyderabad Municipal Corporation elections