క్షీరాబ్ధి ద్వాదశి విశిష్టత ఏమిటో తెలుసుకోండి...

Know about Ksheerabdi Dwadasi Pooja

01:39 PM ON 11th November, 2016 By Mirchi Vilas

Know about Ksheerabdi Dwadasi Pooja

ప్రస్తుతం నడుస్తున్న కార్తీకమాసంలో ప్రతిరోజూ చాలా మంచిదనే అంటారు. నదీ స్నానాలు, దైవ దర్శనం, దీపం పెట్టడం, దీపాలు వదలడం, ఉపవాసాలు ఇలా ఎన్నో చేస్తుంటారు. ఇక ఈవేళ శుక్రవారం శుక్ల పక్ష ద్వాదశి. ఇది అత్యంత విశేషమైనది. దీన్నీ క్షీరాబ్ధి ద్వాదశి, చిలుకు ద్వాదశి, ఉత్థానైకాదశి అని అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తనయోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అనే పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశినాడు ముప్పై ముగ్గురు దేవతలలో శ్రీ మహాలక్ష్మీ సమేతుడై తులసీ ధాత్రివనంలో ఉంటాడని చెప్తారు.

1/11 Pages

ఈ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి ఎందుకంటారంటే, పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మధనం చేసిన రోజు. కనుక దీనికి క్షీరాబ్ధి ద్వాదశి అను పేరు వచ్చింది. పాల సముద్రాన్ని చిలికడం వలన చిల్కు ద్వాదశి అని కూడా అంటారు.

English summary

Know about Ksheerabdi Dwadasi Pooja