నోట్ల కష్టాలు తీర్చే మైక్రో ఏటీఎంల గురించి తెలుసుకోండి...

Know about micro atm's

10:45 AM ON 15th November, 2016 By Mirchi Vilas

Know about micro atm's

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బ్యాంకులు సెలవురోజుల్లో కూడా పనిచేసినా ఇంకా కష్టాలు తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో ప్రజానీకం పడుతున్న ఇబ్బందులను వీలైనంతగా తగ్గించేందుకు కేంద్రం చేపడుతున్న చర్యల్లో భాగంగా కొత్తగా మైక్రో ఏటీఎంలను ప్రవేశపెడుతున్నట్టు పేర్కొంది. ఇప్పటి వరకు ఏటీఎంలు మాత్రమే తెలిసిన వారికి మైక్రో ఏటీఎంల గురించి పెద్దగా తెలియదు. ఎందుకంటే వీటి అవసరం ఇప్పటి వరకు పెద్దగా రాలేదు. కానీ ఇప్పుడు నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో పెద్ద ఎత్తున మైక్రో ఏటీఎంలను రంగంలోకి దించి లావాదేవీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ఈ ఏటీఎంలు ఎలా పనిచేస్తాయన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. అందుకే ఒక్కసారి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

1/5 Pages

మైక్రో ఏటీఎంలు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి కార్డు స్వైపింగ్ మిషన్లను పోలి ఉంటాయి. వీటికి జీపీఆర్ఎస్ కనెక్షన్ ఉంటుంది. ఇందులో ఏటీఎం కార్డు(డెబిట్ కార్డు) స్వైప్ చేయగానే వెంటనే అది సంబంధిత బ్యాంకుకు కనెక్ట్ అవుతుంది. వెంటనే కార్డుదారుడి ఖాతా వివరాలు డిస్ప్లే అవుతాయి.

English summary

Know about micro atm's