సూపర్ కార్ల సీక్రెట్స్ తెలుసుకోండి...

Know about the secrets of super cars

01:51 PM ON 14th November, 2016 By Mirchi Vilas

Know about the secrets of super cars

సూపర్ కార్లు వస్తే వాటిని చూడ్డానికి జనం ఎగబడతారు. అయితే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆలివ్ బిసౌత్ర రెస్టారెంట్ లో సూపర్ కార్ల ప్రదర్శన నిర్వహించడంతో మాంచి స్పందన వచ్చింది. నగరంలో మొట్టమొదటిసారిగా కానన్ బాల్ క్లబ్ నిర్వహించిన సూపర్ కార్ షోలో లంబోర్గిని, పోర్శీ, జీటీ ఆర్, మెర్సిడెస్ ఏఎంజీ, ఆడి, జాగ్వర్, ఆస్టన్ మార్టిన్ లాంటి కార్లు కొలువుదీరాయి. వీటికి పోటీగా ఇండియన్, బెనాలీ లాంటి కంపెనీల బైక్ లు కూడా కనువిందు చేశాయి. సూపర్ కార్ల యజమానులు కలుసుకోవడంతో పాటుగా నెట్ వర్కింగ్ ను పెంచుకోవడమే లక్ష్యంగా తొలిసారిగా నిర్వహించిన ఈ షోకు దాదాపు 30 మందికి పైగా హాజరయ్యారు. అందులోని కొన్ని విశేషాలను తెలుసుకుందామా...

1/6 Pages

కోటి రూపాయల ఖరీదు కలిగిన ప్రతి కారూ సూపర్ కార్ కాదు. అలాగే ఒకటి రెండు లగ్జరీ సౌకర్యాలు కలిగిన ప్రతిదీ లగ్జరీ కారూ కాదు. అటు లగ్జరీ.. ఇటు వేగం... ఈ రెండింటితో పాటుగా ధర కూడా కలిగిన ఈ సూపర్ కార్లు అందరికీ చేరువలో ఉండవు. కనీసం కోటిన్నర రూపాయల ప్రారంభ ధర, 300 బీహెచ్పీ శక్తి. పూర్తి స్థాయి ఏరోడైనమిక్స్ కలిగి ఉండటంతో పాటుగా లగ్జరీకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కార్ల యజమానులతో ఏర్పడిన క్లబ్ కానన్ బాల్ క్లబ్. ఢిల్లీలో ఆరేళ్ల క్రితం ఏర్పడిన ఈ క్లబ్ కు చండీఘడ్, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో సభ్యులు ఉండగా ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఈ క్లబ్ శాఖ ప్రారంభమైంది.

English summary

Know about the secrets of super cars