ఆరోగ్యాన్ని తెలిపే కళ్ళు

Know about your Health by Checking Eyes

01:29 PM ON 26th December, 2015 By Mirchi Vilas

Know about your Health by Checking Eyes

కళ్ళు అనేవి మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూడడానికి దేవుడు ప్రసాదించిన వరం. అంతేకాక కళ్ళు మనకు ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి. అనేక ఆరోగ్య సమస్యలకు ముందస్తు హెచ్చరికలను కళ్ళు ఇస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కళ్ళను పరీక్ష చేసిది కేవలం దృష్టి గురించి మాత్రమే కాకుండా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నయా లేదా అనే విషయం కోసం కూడా కళ్ళను పరీక్ష చేస్తారు.

1/19 Pages

కార్డియోవాస్క్యులర్ సమస్యల కోసం

నేత్ర వైద్యులు ఆరోగ్య సమస్యల పరీక్ష సమయంలో ప్రారంభ సంకేతాలను కళ్ళ ద్వారానే తెలుసుకుంటారు. ఎందుకంటే కళ్ళ ద్వారా అయితే రక్త నాళాలను పరిశీలన చేయటం సులభం. అధిక రక్తపోటు మరియు మధుమేహం గురించి హెచ్చరిక సంకేతాలను కంటి ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాక స్ట్రోక్ మరియు ఇతర గుండె వ్యాధులకు దారి తీసే పరిస్థితులను కూడా తెలుసుకోవచ్చు.

సాదారణ ఆరోగ్యం కోసం కళ్ళు మనకు ఎన్నో సూచనలను ఇస్తాయి. కళ్ళు ఒక వ్యక్తి యొక్క మెదడు ఆరోగ్య మార్పులకు కూడా సుచనలను ఇస్తాయి. అంతేకాక దృష్టి నాడి, మెదడు కణితులు లేదా మల్టిపుల్ స్క్లేరోసిస్ వంటి వాటికీ కూడా సూచనలు ఇస్తాయి. అలాగే కంటి రక్తనాళాల్లో జరిగే మార్పులు అథెరోస్క్లెరోటిక్ వ్యాధిని హెచ్చరిస్తాయి.

English summary

Know about your Health by Checking Eyes. Simple steps. Read entire article for more information on the same.