రద్దయిన నోట్లు మార్చుకోండిలా...

Know how to change your 500 and 1000 notes

11:30 AM ON 9th November, 2016 By Mirchi Vilas

Know how to change your 500 and 1000 notes

మంగళవారం అర్థరాత్రి నుండి 500/-, 1000/- రూపాయల నోట్లు చెల్లవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో అవినీతి వ్యతిరేకులు, ఆర్థికవేత్తలు, సాధారణ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ అంశం ఇప్పుడు గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వెబ్ సైట్లలో ట్రెండింగ్ గా మారింది. అయితే ఈ నోట్లను ఎలా మార్చుకోవాలా అనే దానిపై అందరిలోనూ గుబులు మొదలైంది.

చాలామంది దగ్గర జీతం, వేతనం రూపంలో వచ్చిన డబ్బు 500, 1000నోట్లుగా ఉండడమే దీనికి కారణం. అయితే దీని మీద పూర్తి స్థాయి క్లారిటీ లేని కారణంగా మధ్యతరగతి ప్రజలకు ఆందోళనకు గురవుతున్నారు. పాత నోట్లను ఎలా మార్చుకోవాలి? దాని కోసం ఏం చేయాలనే విషయాలు తెలియక నానా హైరానా పడిపోతున్నారు.

1/9 Pages

అయితే పాత నోట్లను నవంబర్ 10 నుండి డిసెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం ఉంది. బ్యాంక్ లు, పోస్ట్ ఆఫీస్ లో పాత 500/- 1000/- నోట్లు ఇచ్చి వాటి ప్లేస్ లో 100/- 50/- నోట్లు తీసుకోవొచ్చు. ఆథార్/ఓటర్ ఐడిలలో ఏదో ఒక గుర్తింపు కార్డ్ చూపించి రోజుకు 4 వేల రూపాయల వరకు తీసుకునే అవకాశం ఉంది.

English summary

Know how to change your 500 and 1000 notes