ఇంటర్నెట్ లేకుండా మీ బ్యాంకు బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఇలా చెయ్యండి...

Know your bank balance with this technique

10:53 AM ON 26th November, 2016 By Mirchi Vilas

Know your bank balance with this technique

బ్యాంకు నుంచి, ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేస్తే వెంటనే సెల్ కి మెసేజ్ వచ్చేసేది. అయితే రూ. 500, రూ.1,000 నోట్లు రద్దు చేసిన తరుణంలో మన బ్యాంకు అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. కారణం నోట్లు మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరి ఉంటున్నారు. సాంకేతిక సమస్యతో ఏటీఎంలు సరిగా పనిచేయడం లేదు. చాలా మంది తమ వద్ద ఉన్న పాతనోట్లను పెద్దమొత్తంలో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తున్నారు. అకౌంట్ లో సొమ్ము పడిందో లేదో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియక తికమకపడుతున్నారు. చెక్కులు జారీ చేయాలన్నా, ఏదైనా కొనాలన్నా, ఏటీఎం ద్వారా మనీ డ్రా చేయాలన్నా ముందు బ్యాంకు అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో తెలియాల్సి ఉంది. ఏ నంబరుకు కాల్ చేస్తే బ్యాలెన్స్ తెలుస్తుందో అనే సందేహం కూడా చాలామందికి ఉంది. ఒకవేళ ఆ నంబరు దొరికిన తరువాత కాల్ చేస్తే ఆప్షన్లు నొక్కండంటూ సమయాన్ని వృథా చేస్తాయి. ఈ తలనొప్పుల నుంచి ఖాతా దారులను కాపాడేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఓ కొత్త నంబర్ ను ప్రవేశపెట్టింది. ఈ నంబర్ కు డయల్ చేస్తే క్షణాల్లో ఖాతాల్లో బాలన్స్ ఎంత ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. దీనికి ఇంటర్నెట్ తో కూడా పనిలేదు.

1/6 Pages

బ్యాంక్ అకౌంట్ లో రిజిస్టర్ అయిన మొబైల్ నుంచి స్టార్ 99 యాష్ కు డయల్ చేస్తే చాలు. ఈ నంబరుకు డయల్ చేసిన వెంటనే మీ స్క్రీన్ పై మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.

English summary

Know your bank balance with this technique