హరికృష్ణతో నాని  - సైకిలెక్కడం ఖాయమా

Kodali Nani To Join In TDP

01:13 PM ON 2nd April, 2016 By Mirchi Vilas

Kodali Nani To Join In TDP

వైస్సార్ సిపిలో ఒక్కొక్కరూ జారుకుంటున్నారు. ఇప్పటికే 8మంది ఎంఎల్ఎ లు టిడిపి వైపు వచ్చేయగా , కొత్తగా జ్యోతుల నెహ్రు , వరుపుల సుబ్బారావు కూడా టిడిపి గూటికి రాబోతున్నారు. ముహూర్తం కూడా ఖరారైంది. ఇక తాజాగా గుడివాడ ఎంఎల్ఎ కొడాలి నాని గోడ దూకేసి , సైకిలు ఎక్కడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. లబ్బిపేటలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు హరికృష్ణ ఒకే కారులో రావడం దీనికి బలం చేకూరుస్తోంది. అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నాని... టీడీపీలోకి చేరేందుకే హరికష్ణను కలిశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కుడా చదవండి:'చిన్నారి పెళ్ళికూతురు' ఆనంది ఆత్మహత్య

అయితే ఆయన రాకను టీడీపీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయట. పార్టీ వీడి వెళ్లినప్పుడు చంద్రబాబుపై నాని చేసిన విమర్శలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నామని, ఆయనను పార్టీలోకి చేర్చుకుంటే ఒప్పుకునేది లేదని నాయకులు తేల్చి చెబుతున్నారట. కొడాలి నాని టీడీపీలోకి రావడం పట్ల సానుకూలంగా ఉన్న నేతలు మాత్రం కొంత భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. జగన్ ఆదేశాల మేరకే అప్పట్లో తాను ఆరోపణలు చేశాననీ, ఏ వ్యాఖ్యలు తనకు తానుగా చేయలేదని నాని చెబుతున్నారని వారు అంటున్నారు. కొందరి వాదన ఇలా ఉంటే... టీడీపీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదని భావిస్తూ.. హరికృష్ణే తమ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే హరికృష్ణతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చాననీ, తనకు పార్టీపై అసంతృప్తి లేదని కొడాలి నాని అంటున్నారు.

ఇవి కుడా చదవండి:

ఆ టాలీవుడ్ స్టార్ హీరోకి ఎయిడ్స్?!

భారత్ ఓడిపోయిందోచ్ ట్విట్టర్లో రెచ్చిపోయిన బంగ్లా క్రికెటర్

పవన్ రాలేదు కానీ.. మూడో భార్య వచ్చింది!

English summary

A News Camto Know That Ysrcp Leader Gudiwada MLA Kodali Nani To Join again in TDP by Leaving YSR Congress Party.