ఏడ్చేసిన కోదండ రామిరెడ్డి

Kodanda Rami Reddy Crying

12:58 PM ON 20th June, 2016 By Mirchi Vilas

Kodanda Rami Reddy Crying

సినిమా వాళ్ళను చూస్తే, అబ్బో వీళ్ళకేం అనుకుంటాం ... స్టార్ వేల్యూ వచ్చేవరకూ కష్టపడితే సరిపోదు .. ఓ రేంజ్ కి చేరాక కూడా జాగ్రత్తగా వుండాలి. ఒక్క ప్లాప్ వచ్చినా ఇక అంతే సంగతులు ... అందుకే అంటారు జీవితం పట్టు మాన్పు కానేకాదని... ఒకప్పుడు స్టార్ దర్శకునిగా పేరొందిన ఎ వన్ డైరెక్టర్ ఎ కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన ఏ హీరో చిత్రమైనా సరే సూపర్ హిట్ కావాల్సిందే అన్నట్టు వుండేది. చిరంజీవి , కృష్ణ , శోభన్ బాబు , నాగార్జున , అక్కినేని ఇలా అందరి చిత్రాలు మంచి రేంజ్ కి తీసికెళ్ళిన చేయి తిరిగిన దర్శకుడు ఈయన .. అయితే ఓ సినిమా రివ్యూ వార్త విని ఈయన ఏకంగా ఏడ్చేశాడు. అది చిరంజీవి నటించిన 'అభిలాష' చిత్రం. ఈ సినిమా ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ రచించిన నవల ఆధారంగా కోదండ రామిరెడ్డి తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలయ్యాక యండమూరి , కోదండ రామిరెడ్డి హైదరాబాద్ లో వుంటే, కోదండ రామిరెడ్డి భార్య ఫోన్ చేసి 'అభిలాష రివ్యూ చూస్తుంటే ప్లాప్ టాక్ వస్తోందని చెప్పారట. దీంతో కోదండ రామిరెడ్డి కంట తడి ఆగలేదట. ఈ విషయం కోదండ రామిరెడ్డి సమక్షంలో యండమూరి స్వయంగా చెప్పారు. మా టివి ఆవార్డ్స్ ఫంక్షన్ లో అవార్డు స్వీకరిచిన యండమూరి సినీ జీవితం గురించి వివరిస్తూ, ఈ సంఘటన ప్రస్తావించారు.

ఇది కూడా చూడండి: ఒకే సినిమాలో తండ్రి కొడుకు పాత్రల్లో అలరించిన మన హీరోలు

ఇది కూడా చూడండి: మహాభారతంలో పరీక్షితుడు గురించి మీకు తెలుసా!

ఇది కూడా చూడండి: ప్రేమ వివాహాన్ని ఈ ఐడియాస్ తో పేరెంట్స్ ని ఒప్పించవచ్చు

English summary

Kodanda Rami Reddy Crying at MAA TV awards in 2016.