సారీ.. చెప్పిన పాపులర్ డైరెక్టర్

Kodandarami Reddy says sorry to Chiranjeevi

03:13 PM ON 19th July, 2016 By Mirchi Vilas

Kodandarami Reddy says sorry to Chiranjeevi

రైతులకు అండగా ఉంటానంటూ ఈ రోజుల్లో సందేశాత్మక చిత్రాలు చేస్తే ప్రజలు చూడరంటూ మెగాస్టార్ చిరు 150వ మూవీపై డైరెక్టర్ కోదండరామిరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. దీంతో కోదండరామిరెడ్డి దిగిరాక తప్పలేదు. అసలేం జరిగిందంటే, రీసెంట్ గా విజయవాడ వెళ్లిన ఈ డైరెక్టర్.. తాను చిరంజీవితో గనుక సినిమా చెయ్యాల్సివస్తే పూర్తిస్థాయి కామెడీ, లవ్, యాక్షన్ వున్న స్టోరీని ఎంచుకుంటాననీ, ఆయన బాడీ అంతా కామెడీతో నిండి ఉంటుందని తెలిపారు. రైతులకు అండగా ఉంటానంటూ ఈ రోజుల్లో సందేశాత్మక చిత్రాలు చేస్తే ప్రజలు చూడరని అనేసారు.

ఇక దీనిపై ఇంటాబయటా దుమారం రేగడంతో చివరకు డైరెక్టర్ కోదండరామిరెడ్డి దిగొచ్చాడు. ఆ రోజు తాను అలా మాట్లాడానన్న విషయం ఛానెళ్లల్లో చూసేవరకు తనకు తెలీదన్నాడు. అవన్నీ చూసిన తర్వాత తానిలా మాట్లాడానా అని చాలా బాధపడ్డానంటూ మనసులోని మాట బయటపెట్టాడు. దేవుడి సాక్షిగా చెబుతున్నానని, తనకు తెలియకుండానే ఆ రెండు మాటలు జారిపోయాయంటూ నొచ్చుకున్నాడు. చిరంజీవితో తాను చాలా సినిమాలు చేశానని, తమ ఇద్దరి మధ్య నేటికీ ఆ రిలేషన్ వుందని గుర్తు చేశాడు. పొరపాటున మాట్లాడనని, కాబట్టి చిరంజీవికి, మెగా అభిమానులకు సారీ చెబుతున్నానని కోదండరామిరెడ్డి అన్నాడు. ఇక దీంతో వివాదం సమసినట్లే.

English summary

Kodandarami Reddy says sorry to Chiranjeevi