మెగా 150వ మూవీపై కోదండ రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్

Kodandarami Reddy shocking Comments on Chiru

11:29 AM ON 11th July, 2016 By Mirchi Vilas

Kodandarami Reddy shocking Comments on Chiru

మెగాస్టార్ చిరంజీవితో అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడు ఎవరంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలియక పోవచ్చునేమో గానీ, నిక్కచ్చిగా దర్శకుడు కోదండరామిరెడ్డి అని చెప్పాలి. ఓ విధంగా ఇప్పటివాళ్ళకు ఈయనంటే, కొత్తగా పరిచయం చేయాల్సి రావచ్చు. చిరును తిరుగులేని స్టార్ గా మార్చిన ఖైదీ సినిమాకు దర్శకుడు కోదండ రామిరెడ్డి, చిరంజీవికి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. ఖైదీ.. ఛాలెంజ్.. రాక్షసుడు, పసివాడి ప్రాణం.. అత్తకు యముడు.. అమ్మాయికి మెగుడు ...ఇలా ఎన్నో హిట్ చిత్రాలు అందించిన కోదండరామిరెడ్డి తాజాగా చిరు 150వ సినిమా గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కోదండరామిరెడ్డి చిరు 150వ సినిమా గురించి మాట్లాడుతూ.. యాక్షన్.. సందేశాత్మక సినిమాలు తీస్తే జనాలు నవ్వుకుంటారని అనేసారు. తన వరకు తాను చిరు.. హాస్య సినిమా చేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. చిరుతో సందేశాత్మక చిత్రం తీస్తే ఇప్పటి ప్రేక్షకులు చూడరని కూడా ఆయన తేల్చేశారు. చిరు 150వ సినిమా మీద అందరూ ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడుతున్న వేళ, అందుకు భిన్నంగా కోదండరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సహజంగానే ఆసక్తిగా వున్నాయి. ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

నిజానికి సౌమ్యంగా వుండే కోదండ రామిరెడ్డి కి ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం అలవాటు లేదు. అయితే సడన్ గా కోదండరామిరెడ్డి లాంటి సీనియర్ డైరెక్టర్ చిరు 150వ సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చూస్తుంటే, మెగాకు - ఆయనకు మధ్య ఏమైనా విబేధాలు చోటుచేసుకున్నాయా అని చూస్తే, అలాంటిదేమీ లేదని తెలిసిందట. మీడియా ఫోకస్ చేసే తీరుతో ఇదో సంచలనంగా మారింది తప్ప, సహజంగా సైలెంట్ గా ఉండే కోదండరామిరెడ్డి, మరి మెగాస్టార్ రీఎంట్రీ మీద చేసిన వ్యాఖ్యలు మామూలువేనని, ఇందులో పెద్దగా తప్పు పట్టాల్సిందేమీ లేదని, కొందరు సినీ పెద్దలు విశ్లేషించారు. మరి యాధాలాపంగా అన్నారో కావాలని అన్నారో గానీ కోదండ రామిరెడ్డి వ్యాఖ్యలు మాత్రం సంచలనం అయ్యాయి.

ఇది కూడా చూడండి: పేరు లో మొదటి అక్షరం ఏం చెప్తుంది ?

ఇది కూడా చూడండి: స్త్రీలు చేసేవి చేయకూడనివి

ఇది కూడా చూడండి: భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

English summary

Kodandarami Reddy shocking Comments on Chiranjeevi 150th movie.