ఆ సినిమా కథ చిరుకి నచ్చలేదు.. అయినా సూపర్ హిట్ అయింది!

Kodi Ramakrishna about Intlo Ramayya Veedhilo Krishnayya movie

11:58 AM ON 13th October, 2016 By Mirchi Vilas

Kodi Ramakrishna about Intlo Ramayya Veedhilo Krishnayya movie

ఎన్నో విజయవంతమైన చిత్రాలను దర్శకుడు కోడి రామకృష్ణ అందించారు. దాదాపు అందరి హీరోలతో సినిమాలు చేసిన కోడి రామకృష్ణ సినిమాల్లో పాత్రలు కూడా వేసి రక్తికట్టించారు. సందర్భోచితంగా మాటలు పలికించడంలో దిట్ట. ఇక కథలో సెంటిమెంట్ పండితే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, తన సక్సెస్ వెనుక కూడా ఎన్నో సెంటిమెంట్స్ ఉన్నాయని శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పేమాట. ఈయన 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొని పలు విషయాలు వెల్లడించారు.

1/4 Pages

నుదుటిపై బ్యాండ్, చేతులకు తాళ్లు, వేళ్లకు ఉంగరాలు, ఇవన్నీ కోడి రామకృష్ణ సెంటిమెంటల్ టచ్. మా అమ్మవల్లే నాకు భక్తి ఏర్పడింది. చిన్నప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలకే పెద్ద కాలువకు తీసుకెళ్లి స్నానం చేయించేది. అట్నుంచి గుడికి వెళ్లేవాళ్లం. ఒకసారి కాలువ దగ్గర మా అమ్మ బట్టలు ఉతుకుతుంటే.. నేను అక్కడే అటు ఇటూ నడుస్తున్నా. ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయా. ఒకతను నన్ను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఆమె బోరున ఏడ్చేసింది. అదే బాధలో నన్ను విపరీతంగా కొట్టేసింది. వెంటనే గుడికి తీసుకెళ్లి పూజ చేయించింది. ఇప్పట్నుంచి దేవుడ్నే నమ్ముకో. నీ కడుపు నిండుగా ఉండాలి. మళ్లీ నీకు పుట్టాలిగా.. అంది. అప్పట్నుంచి అవే మాటలు ఫాలో అవుతున్నా అని ఆయన వివరించారు.

English summary

Kodi Ramakrishna about Intlo Ramayya Veedhilo Krishnayya movie