కోహినూర్‌ ఇక తిరిగి రానట్టే!

Kohinoor diamond will not regain by India

04:35 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Kohinoor diamond will not regain by India

కోహినూర్‌ వజ్రాన్ని బ్రిటన్‌కు బహుమతిగా ఇచ్చామని, దానిని ఇక తిరిగి తీసుకురాలేమని సుప్రీం కోర్టుకు కేంద్రం తేల్చి చెప్పేసింది. ప్రపంచంలోనే ప్రముఖ వజ్రమైన కోహినూర్‌ ఇక ఎప్పటికీ తిరిగి వచ్చే అవకాశం లేదని కేంద్రం సమర్పించిన సమాధానాన్ని బట్టి తెలుస్తోంది. స్వాతంత్య్రానికి పూర్వం దేశం ఆవలకు తరలిపోయిన ప్రాచీన సంపదను ప్రభుత్వం తీసుకు రాకూడదంటూ 43 ఏండ్ల క్రితం నాటి చట్టాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ కుమార్‌ సోమవారం వాదనలు వినిపించారు. 1849 నాటి సిక్కు యుద్ధంలో ఓడిపోయిన నేపథ్యంలో మహారాజా రంజిత్‌సింగ్‌ 105.602 క్యారెట్ల కోహినూర్‌ వజ్రాన్ని ఈస్టిండియా కంపెనీకి బహుమతిగా అందజేశారని సుప్రీంకు నివేధించారు.

కోహినూర్‌ వజ్రంతో పాటు భారత్‌ నుంచి తీసుకుపోయిన ప్రాచీన సంపదను తిరిగి తీసుకురావాలని బ్రిటన్‌లోని భారత హైకమీషనర్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ అఖిల భారత మానవ హక్కులు, సామాజిక న్యాయ సంస్థ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో, విచారణ చేపట్టిన న్యాయస్థానం గతంలో కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి తీసుకు రావాలని స్వచ్చంధ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను రద్దు చేయాలని కేంద్రం చేసిన అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. ఈ అంశం పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆరు వారాల్లోగా స్పష్టం చేయాలని ఆదేశించింది.

కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలనే ప్రతిపాదనను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ 2010లో తెలిపారు. అప్పట్లో ఆయన ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతే కాకుండా ఒకసారి బ్రిటన్‌ సంపాదించిన వస్తువులను తిరిగి ఇవ్వడం ప్రారంభిస్తే మొత్తం మ్యూజియం ఖాళీ అయిపోతుందన్నారు. మొత్తానికి మనదైన కోహినూర్ ఇక తిరిగి రాదనే మాట జీర్ణించు కోలేనిదేనని చెప్పక తప్పదు.

English summary

Kohinoor diamond will not regain by India. Latest news that Our Indian diamond and most valuable diamond Kohinoor will not regain by India.