ఎవరికీ దక్కని గౌరవం కోహ్లీ సొంతమైంది

Kohli adorns the cover of 2017 Wisden Almanac

12:09 PM ON 6th February, 2017 By Mirchi Vilas

Kohli adorns the cover of 2017 Wisden Almanac

వరల్డ్ నెంబర్ వన్ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి దిగ్గజాలకు సైతం దక్కని గౌరవం లభించింది. దిగ్గజ ఆటగాళ్లు గంగూలి, ద్రవిడ్, లక్ష్మణ్, కుంబ్లేలు సైతం ఈ గౌరవానికి నోచుకోలేదు. ఇంతకీ అదేమిటంటే, ఇంగ్లండ్‌లో ప్రచురితమయ్యే ప్రముఖ మ్యాగజైన్ ‘విజ్డన్’ 2017కు తన కవర్ పేజ్‌పై కోహ్లీ ఫొటోను ప్రచురించింది. ఇది నిజంగా అరుదైన గౌరవమే. కారణం, సచిన్ టెండూల్కర్ మాత్రమే కోహ్లీ కన్న ముందు విజ్డన్ కవర్ పేజ్‌పై నిలిచిన భారత క్రికెటర్. తన రిటైర్మెంట్ ప్రకటించిన క్రమంలో 2014లో విజ్డన్ కవర్ పేజ్ వ్యక్తిగా నిలిచాడు.

కాగా 2016లో కోహ్లీ రికార్డ్స్ చూస్తే, 25 వన్డే సెంచరీలు చేసిన అత్యంత వేగవంతమైన ఆటగాడు గా నిలిచాడు. వేగంగా 7500 వన్డే పరుగులు చేసిన క్రికెటర్ గా, అలాగే ఛేజింగ్‌లో విజయవంతమైన 14 సెంచరీలు చేసి సచన్ సరసన నిలిచాడు ఐపిఎల్ సింగిల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కోహ్లీదే. టెస్టుల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక కెప్టెన్ కోహ్లీయే ఒకే క్యాలెండర్ ఇయర్లో వెయ్యి పరుగులు చేయడమే కాదు , అంతకుముందు 2011లో ద్రవిడ్ 1145 పరుగులు చేశాడు.

కోహ్లీ ఒక ఆధునిక క్రికెటర్ అని, అతనికి గుర్తింపు ఇవ్వడానికి ఇదే సరైన సమయమని విజ్డన్ ఎడిటర్ లారెన్స్ అన్నారు. తనకు పోటీగా నిలిచిన వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఏబీ డెవీలియర్స్, విలియమ్సన్, రూట్, స్టీవ్ స్మిత్‌లను కోహ్లీ తేలికగా అధిగమించాడన్నారు. అయితే 2017 విజ్డన్ మ్యాగజైన్ ఏప్రిల్ నెలలో విడుదలకానుంది. అయితే కోహ్లీకి ఈ గుర్తింపు దక్కడానికి ముఖ్య కారణం 2016లో అతని అద్భుత ప్రదర్శనే. మూడు ఫార్మెట్లలో కలిపి గతేడాది 2595 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లండ్‌పై టెస్ట్, వన్డే, టీ20 సిరీస్‌లలో అద్భుత విజయాన్ని అందుకున్నాడు.

ఇది కూడా చూడండి: తులసి మొక్క ఆకులు రంగు మారితే ప్రమాదమేనట

ఇది కూడా చూడండి: పెళ్ళికొడుకు లేడు ... అయినా పెళ్లయింది... ఎలా ?

English summary

Virat Kohli's cover pic was added on England magazine Wisden Almanac 2017.