అనుష్క జర్క్ కి కోహ్లీ అవుట్?

Kohli and Anushka Sharma Break Up

10:16 AM ON 11th February, 2016 By Mirchi Vilas

Kohli and Anushka Sharma Break Up

పరుగుల రాజు విరాట్ కోహ్లీ ప్రేమలో 'రన్' అవుట్ అయిపోయాడా? ఇన్నాళ్ళు విరాట్ అనుష్క శర్మ ను చూసి గాల్లో ముద్దులు విసిరితే, ఇప్పుడు కోహ్లీని అనుష్క గాల్లో వుంచేసిందట. ఇన్నాళ్ళూ రాసుకు పూసుకు తిరిగిన వీరిద్దరికీ తేడా వచ్చిసేందట. కోహ్లీకి ఈ బాలీవుడ్ భామ జర్క్ ఇచ్చిందట. దీంతో కోహ్లీ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడట. ఒకసారి పాత రోజులు తలచుకుంటే, వీరి తొలిపరిచయం 2013 జులైలో ఒక ప్రచార సన్నివేశం షూటింగులో సందర్భంగా జరిగింది. దక్షిణ టూర్‌ తర్వాత విరాట్‌ - అనుష్కల ప్రేమాయణం బహిరంగం అయింది. ఆ తర్వాత ఇద్దరూ ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని కోహ్లి ముంబై వచ్చినప్పుడల్లా అక్కడే గడిపేవారు.

ఇక ఆస్ట్రేలియా - ఇండియా మధ్య టెస్ట్‌ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు విరాట్‌ కోహ్లి తన ప్రేయసి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మను అధికారికంగా తన వెంట వచ్చేందుకు క్రికెట్‌ బోర్డు అనుమతి తీసుకోవడం, ఇద్దరూ కలిసి సిడ్నీ డార్లింగ్‌ హార్బరులో ముద్దు ముచ్చట తీర్చుకోవడం, సెంచరీ చేయగానే అనుష్క వైపు చూసి విరాట్‌ గాలిలోకి ముద్దులు విసరడం వంటి సన్నివేశాలు రక్తి కట్టించాయి. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో ఆస్ట్రేలియన్‌ వ్యాఖ్యాత మైఖేల్‌ స్లాటర్‌ ప్రత్యక్ష ప్రసారంలో అనుష్క శర్మను కోహ్లి భార్యగా సంభోదించి సంచలనం రేపడం వీరి ప్రేమాయణం తారాస్థాయికి చేరింది. దీంతో ఇద్దరి మధ్యా ముదిరి పాకాన పడిందనుకున్న ప్రేమ కాస్తా, దెబ్బ తెనేసిందట. ఇద్దరి మధ్యా సంబంధాలు బెడిసి కొడుతున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. అసలు ఇంతదాకా పరిస్థితి వెళ్ళడానికి ప్రధాన కారణం అనుష్క అర్థనగ్న ఫోటో అంతర్జాతీయ మ్యాగజైన్‌లో ప్రచురితమవడం విరాట్‌కు కోపం తెప్పించడంతో అనుష్కను పిలిచి అభ్యంతరం వ్యక్తం చేశాడట. ఇక పెళ్లి చేసుకోవడమే పరిష్కార మార్గమని అనుష్కకు సూచించాడట. అయితే బాలీవుడ్‌లో తను ఓ మెట్టు పైన వున్నానని, ఆ హోదా వదులుకుని పెళ్లి చేసుకోవడం కుదరదని అనుష్క తేల్చి చెప్పేసిందట. దీంతో విరాట్‌ ఖంగు తిన్నాడట. అలా వారిద్దరి మధ్యా మూడేళ్లుగా సాగుతున్న ప్రేమబంధానికి ఎదురు దెబ్బ తగిలిందని పుకార్లు హెచ్చాయి. అయితే ఇది ఎంతవరకూ నిజమో కాదో తెలియదు గానీ, సోషల్‌ మీడియాకు దూరంగా వుండాలని మాత్రం ప్రస్తుతానికి ఇద్దరూ నిర్ణయించుకున్నారట. మరి కోహ్లీ ప్రేమలో 'రన్' అవుట్ తో ఆగుతాడా , దూసుకు పోతాడా?

English summary

We all well know that India Star cricketer and Bollywood Heroine Anushka Sharma Was Loving Each Other. Anushka Sharma was appeared with Virat Kohli soo many occasions.Recently a news came to know that they two were broke up their love.But either Virat Kohli or Anushka Sharma not responded on this News