బీసీసీఐ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా కోహ్లి 

Kohli As BCCI Cricketer Of The Year

12:28 PM ON 1st January, 2016 By Mirchi Vilas

Kohli As BCCI Cricketer Of The Year

2015 సంవత్సరానికిగానూ బీసీసీఐ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా భారత్‌ టెస్ట్‌ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 2015 ఎంపికయ్యాడు. ఏటా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రికెటర్లకు బీసీసీఐ ఈ అవార్డును అందిస్తుంది. 2015లో 15 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 640 పరుగులు చేయగా, 20 వన్డే మ్యాచ్‌ల్లో 623 పరుగులు చేశాడు. మహిళల విభాగంలో 5,000 పరుగులు సాధించిన తొలి భారత్‌ మహిళా క్రికెటర్‌, ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచిన భారత మహిళల జట్టు కెప్టెన్‌ మిథాలిరాజ్‌కి ఉత్తమ మహిళా క్రికెటర్‌గా చిదంబరం ట్రోఫీని బీసీసీఐ ప్రకటించింది. మాజీ వికెట్‌ కీపర్‌ సయ్యద్‌ కిర్మాణీకి సీ.కే.నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. జనవరి 5న ముంబయిలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేయనున్నారు.

English summary

Kohli As BCCI Cricketer Of The Year