కోహ్లి టీ20ల్లో నంబర్ వన్..!

Kohli As Number One T20 Batsman

07:01 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Kohli As Number One T20 Batsman

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి టీ20ల్లో నంబర్‌ వన్‌ ర్యాంకు దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బ్యాట్స్‌మెన్ల ర్యాంకింగ్స్‌ లో 892 పాయింట్లతో కోహ్లి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ అరోన్‌ ఫించ్‌ 868 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కోహ్లి వరుసగా 90, 59, 50 స్కోర్లు చేసి 3-0తో భారత్‌ సిరీస్‌ చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లోనే మెరుగైన బ్యాటింగ్‌తో రాణించిన సురేశ్‌ రైనా మూడు స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలవగా.. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నాలుగు స్థానాలను మెరుగుపరుచుకుని 16వ స్థానంలో నిలిచాడు. టీ20 బౌలింగ్‌ విభాగంలో స్పిన్నర్‌ అశ్విన్‌ 692 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలవగా.. వివాదాస్పద బౌలింగ్‌ శైలితో నిషేధం ఎదుర్కొంటున్న వెస్టిండీస్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ 773 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్‌ మినహా భారత్‌ బౌలర్లు ఎవరూ టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు.

English summary

Indian Team Test Captain Virat Kohli holds umber one spot in latest ICC T20 Batsman rankings.Virat Kohli scored 199 runs as India defeated Australia 3-0 in the T20 series against Australia