లంకతో టీ20 సిరీస్‌లో కోహ్లికి రెస్ట్

Kohli Rest To Srilanka T20 Series

10:17 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Kohli Rest To Srilanka T20 Series

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ నెల తొమ్మిది నుంచి శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతనికి రెస్ట్ కల్పించారు. కోహ్లి స్థానంలో 23 ఏళ్ల ఢిల్లీ బౌలర్‌ పవన్‌ నేగికి అవకాశమిచ్చారు. జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టీ20ల్లో అద్భుతంగా రాణించిన కోహ్లి కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అయితే మార్చిలో భారత్‌ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌-2016 నేపథ్యంలో తుది జట్టు ఎంపిక కోసం కుర్రాళ్లని పరీక్షించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున పవన్‌నేగి గత ఏడాది ఐపీఎల్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

English summary

Indian Star Batsman Virat Kohli has been rested for the three 20-over matches against Sri Lanka this month with an eye on the upcoming Twenty20 World Cup.