పాక్ మహిళా క్రికెటర్ల మనసు కొల్లగొట్టిన కోహ్లి

Kohli Was Our Favourite Cricketer Says Pak Womens Team Captain

01:28 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Kohli Was Our Favourite Cricketer Says Pak Womens Team Captain

రోజు రోజుకు భారత యువ కెరటం స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లి ను అభిమానించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. మాజీ క్రికెటర్లు , యువ క్రికెటర్లు ఇలా అందరు కోహ్లిను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది ఇలా ఉంటె కోహ్లికు అనేక మంది మహిళా అభిమానులున్నారనడంలో ఎటువంటి అతియోశక్తి లేదు. అప్పట్లో ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డనిల్లె వ్యట్ట్ తనను పెళ్లి చేసుకోవలసిందిగా బహిరంగంగానే విరాట్ కోహ్లిను కోరింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా విరాట్ కోహ్లి పాకిస్తాన్ మహిళా క్రికెటర్ల మనుసును కుడా కొల్లగొట్టాడు , ఈ విషయాన్ని స్వయంగా పాక్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ సనా మెదిఆకు తెలిపింది.

టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు భారత్ చేరుకుంది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 19న ఢిల్లీలో జరగబోయే మ్యాచ్ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ సనాను మీడియా సభ్యులు మీకు ఇష్టమైన క్రికెర్ ఎవరని అడగగా వెంటనే తమ అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లి అని సమాధానమిచ్చింది. ఆమె మాట్లాడుతూ తమ జట్టులోని వారందరికీ కోహ్లి ఫేవరెట్ క్రికెటర్ అని తాను మాత్రం ధోని అభిమానినని , ఇటు మైదానంలోనూ .. అటు బయట కుడా ధోని ఎంతో హుందాగా ఉంటాడని , జూనియర్లతో కూడిన భారత టీంను ధోని ఒక బలమైన టీం గా తీర్చిదిద్దాడని సనా చెప్పుకొచ్చింది .

English summary

Pakistan Women's Team captain Sana Mir has anwered to a question that Indian Star Cricket Player Virat kohli was the most popular Cricketer among the Pakistan Women cricketers and also said that Dhoni was the favorite cricketer of her. Pakistan Women's cricket Team to play with India on March 19th in Ferozeshah Kotla cricket Stadium in Delhi.