'కొలవరి డి'కి 10 కోట్లు వ్యూలు!

Kolaveri di song got 10 crore views in youtube

04:21 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Kolaveri di song got 10 crore views in youtube

ధనుష్‌, శృతిహాసన్‌ హీరోహీరోయిన్లుగా రజనీకాంత్‌ తనయ 'ఐశ్వర్య' తెరకెక్కించిన చిత్రం '3'. ఈ చిత్రం విడుదలై దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ చిత్రం జయాపజయాలు గురించి పక్కన పెడితే ఇందులో ధనుష్‌ ఆలపించిన 'కొలవరి డి' పాట మాత్రం ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయింది. ఈ పాటకి లిరిక్స్ ధనుష్‌ రాయడం విశేషం. సింపుల్ వర్డ్స్ తో , కేచీ పదాలతో అక్కడక్కడ ఆంగ్లపదాలు టచ్‌ చేస్తూ ఎంతో చక్కగా ఈ పాటను రాశారు ధనుష్‌. ఈ చిత్రానికి అనిరుథ్‌ అనే 18 ఏళ్ల కుర్రాడు సంగీతాన్ని అందించాడు.

సోనీ మ్యూజిక్ సంస్థ నవంబర్ 16, 2011న యూట్యూబ్‌లో విడుదల చేయగా డిసెంబర్‌ 2 2015 నాటికి ఈ సాంగ్‌కి 10 కోట్ల వ్యూలు వచ్చాయంటే ఈ పాట ఇప్పటికీ ఎంత మంది స్మరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

English summary

Kolaveri di song got 10 crore views in youtube. This song is sung by Dhanush and music is composed by Anirudh.