ఆ డైరెక్టర్ లైంగికంగా వేధించాడు...

Kollywood Director Harassed Heroine

12:17 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Kollywood Director Harassed Heroine

ఈమధ్య కొంతమంది తారలు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ దర్శకుల మీదో, నిర్మాతల మీదో, మరొకరి మీదో ఆరోపణలు గుప్పించడం చూస్తున్నాం. తాజాగా కోలీవుడ్ లో ఇప్పుడిప్పుడే పైకొస్తున్న నటి ఇషారా నాయర్ తనను ఓ దర్శకుడు లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఎంగడ ఇరుందీగ ఇవ్వళు నాళ మూవీ డైరెక్టర్ కెవిన్ జోసెఫ్ ఈ చిత్రం షూటింగ్ లో తనపట్ల యూనిట్ సభ్యుల ముందే వల్గర్ గా బిహేవ్ చేశాడని ఆమె వాపోయింది. తమ సినిమా హీరోయిన్ అడ్వాన్స్ తీసుకుని తమకు కాల్ షీట్లుఇచ్చి షూటింగుకు రాకుండా పత్తా లేకుండా పోయిందని ఈ చిత్రం మేకర్స్ పోలీసులకు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చిన నేపథ్యంలో ఇషారా మీడియా ముందు చటుక్కున ప్రత్యక్షమై తన అనుభవాన్ని వివరించింది. 'కెవిన్ జోసెఫ్ నన్ను ఓ వల్గర్ సీన్ లో నటించమన్నాడు.. పైగా నా పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడు.. నేను 6 నెలల కాలానికి కాల్ షీట్లు ఇచ్చినా జస్ట్ రెండు రోజులే షూటింగ్ చేసి తప్పుకున్నారు..కారణమేమిటో అడిగితే ఏవో సాకులు చెబుతున్నారు' అంటూ ఇషారా నాయర్ తెలిపింది. అయితే ఈ ఆరోపణలను కెవిన్ జోసెఫ్ ఖండించాడు. తాను ఇదివరకే సారీ చెప్పానని, తన మూవీ త్వరగా కంప్లీట్ చేసే హడావుడిలో ఉన్నానని అన్నాడు. ఏది నిజమో ఏది అవాస్తవమో ఎవరికెరుక.

ఇవి కూడా చదవండి:రజినీ కూతురు వ్యభిచారిగా ఎందుకైనట్టు?

ఇవి కూడా చదవండి:ఐసియు లో చేరిన రజనీకాంత్... అసలు ఏమయింది ?

English summary

Kollywood Heroine Ishaara Nair was filed a complaint on film director named Kevin Joseph for harassed her in the movie set. But the director opposed her words in a press meet.