అందాలు ఒలికించే ముద్దుగుమ్మలే... అయినా భయపెట్టేసున్నారు

Kollywood star heroines acting in horror movies

04:41 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Kollywood star heroines acting in horror movies

హీరోయిన్లు అంటే అందాలు ఆరబోస్తే సరిపోదని, హర్రర్ మూవీస్ తో కూడా భయపెట్టాలని ఈ నాటి హీరోయిన్లు అనుకుంటున్నారా? లేకపోతే వెండితెరపై అందాలు ఒలకబోసే అందగత్తెలు ప్రస్తుతం భయంకరమైన హావభావాలతో ప్రేక్షకులను ఎందుకు భయపెడుతున్నారు. కథానాయికలు అంటే.. కేవలం యుగళగీతాలకు మాత్రమే పరిమితం కాదని, గుండె ఝల్లుమనేలా భయాన్ని పుట్టించడానికి సిద్ధ పడాలని ఎందుకు అంటున్నారు. ఎందుకంటే నటనతో ఆకట్టుకోవాలంటే ఇలా చేస్తేనే పదికాలాలపాటు ప్రేక్షకుల మదిలో ఉంటామని అంటున్నారు. అందుకే ఓ వైపు హీరోలతో ఆడిపాడుతూనే.. మరోవైపు తమ ప్రత్యేకతను చాటుకొనేలా ఇలాంటి సినిమాలపై దృష్టి పెడుతున్నారు. ఇక హర్రర్ మూవీస్ లో కూడా తామే రాజు, రాణిలా నటిస్తూ... ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు. ఈ కోవలో త్రిష, నయనతార, అనుష్కలతో పాటు పలువురు హీరోయిన్లు ఉండటం గమనార్హం. అరుంధతి నుంచి తాజాగా నాయకి వరకు అందరూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇంకా ఇలాంటి వివరాల్లోకి వెళ్తే...

1/6 Pages

ముందు వరసలో అనుష్క...


కేవలం నాలుగు సన్నివేశాల్లో కనిపించి, రెండు పాటల్లో చిందులేసి వెళ్లిపోయే ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉన్నా, ఇలాంటి మూసధోరణిలో చిక్కుకోకూడదని భావిస్తున్న కొందరు హీరోయిన్లు తమ నటనా ప్రావీణ్యాన్ని చాటుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అలా వారు భిన్నమైన కథలు ఎంచుకోవడం, కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడం వంటివి చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే, అనుష్క గురించి... ఈమె ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి ఆమెకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అదే తరహాలో పలు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ.. ఆచితూచి అడుగులు వేస్తోంది. తర్వాత పంచాక్షరి, రుద్రమదేవి వంటి సవాలుతో కూడుకున్న సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం బాగమతి అనే థ్రిల్లర్ కథలో చేస్తోంది.

English summary

Kollywood star heroines acting in horror movies