'కొమరం పులి' హీరోయిన్ కి తెలుగులో ఛాన్స్‌!

Komaram Puli heroine got chance in telugu movie

06:18 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

Komaram Puli heroine got chance in telugu movie

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటించిన కొమరం పులి చిత్రంలో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్‌ 'నిఖిషా పటేల్‌'. అయితే ఆ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో నిఖిషాకి ఆశించినంత గుర్తింపు రాలేదు. అందం అభినయం మెండుగా ఉన్న నిఖిషాకి తెలుగులో సరైన గుర్తింపు రాక కన్నడ వైపు వెళ్లింది. అక్కడ నిఖిషా నటించిన చిత్రాలు హిట్‌ కావడంతో కన్నడ లో బిజీ హీరోయిన్‌గా మారింది. అయితే కళ్యాణ్‌ రామ్‌ నటించిన 'ఓం 3డి' లో హీరోయిన్‌గా నటించిన నిఖిషా ఈ చిత్రం కూడా ఫ్లాప్‌ కావడంతో ఇంకా మళ్లీ అవకాశాలే రాలేదు. ఇంక చేసేది లేక కన్నడ సినిమాలో చేస్తూ వచ్చింది.

అయితే తాజాగా పూరీజగన్నాథ్‌ సోదరుడైన సాయిరామ్‌ శంకర్‌ సరసన నటించే అవకాశం నిఖిషాని వరించింది. ఇందులో నిఖిషా పాత్ర చాలా థ్రిల్లింగ్‌ గా ఉండటంతో వెంటనే సాయిరామ్‌ పక్కన నటించడానికి అంగీకరించింది. ఈ చిత్రంతో అయినా తనకి తెలుగు లో మంచి బ్రేక్‌ వస్తుందని నిఖిషా ఆశిస్తుంది.

English summary

Komaram Puli heroine got chance in telugu movie opposite Puri jagannadh brother Sai Ram Shankar.