హైదరాబాద్‌ డ్రగ్స్‌ మాఫియా కధాంశంగా కోనా వెంకట్‌ సినిమా

Kona Venkat New Movie On Hyderabad Drugs Mafia

07:41 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Kona Venkat New Movie On Hyderabad Drugs Mafia

ప్రముఖ సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్‌ హైదరాబాద్‌ డ్రగ్స్‌ మాఫియా కధాశంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు . హైదరాబాద్‌ డ్రగ్స్‌ మాఫియాకు పెట్టింది పేరు. దేశ విదేశాలకు చెందిన పలువురు డ్రగ్స్‌ వ్యాపారం చేస్తుంటారు. పోలీసులు అనేక మంది డ్రగ్స్‌ మాఫియా ముఠాలను ఎప్పటికప్పుడు పట్టుకుంటూనే ఉంటారు. అయినా డ్రగ్స్‌ మాఫియా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గతంలో పలువురు సినీరంగ ప్రముఖులు కూడా ఈ డ్రగ్స్‌ మాఫియాలో అరెస్ట్‌ అయిన వారిలో ఉన్నారు . అయితే కోన వెంకట్‌ డ్రగ్స్ మాఫియా ను ప్రధానాంశంగా తీసుకుని చెయ్యబోయే చిత్రం పై ఆసక్తిగా ఉన్నారు. ఇటీవల కోన వెంకట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో 'పౌడరు' అనే టైటిల్‌ను రిజిస్టార్‌ కూడా చేయించాడాని సమాచారం. దీనిపై పలువురు సినీప్రముఖులు తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు తీసే ఇలాంటి సినిమాలను కోన తీయడమేంటని, మన పరువు మనమే తీసుకోకూడదు అని విమర్శలు గుప్పిస్తున్నట్లు సమాచారం . ఈ సినిమా విడుదల కాక ముందే ఇలా ఉందంటే ఇక సినిమా విడుదలైయ్యాక ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

English summary

Tollywood writer cum producert kona venkat is going to be make a new movie on basis of hyderabad drus mafia. Kona Vemnkat recently registerted a title named "Powder" in film chamber