'కొణతాల - గండి'  సైకిల్ ఎక్కేస్తున్నారు 

Konathala Ramakrishna To Join TDP

12:14 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

Konathala Ramakrishna To Join TDP

తెలంగాణాలో కల్సి వచ్చే వాళ్ళను టిఆర్ఎస్ దరి చేర్చుకుంటూ , విపక్షాలను దెబ్బతీస్తుంటే , ఎపిలో కూడా అందివచ్చే వాళ్ళను పార్టీలోకి ఆహ్వానిస్తూ, విపక్షాలను నిర్వీర్యం చేసే పని టిడిపి సాగిస్తోంది. ఇప్పుడు తాజాగా విశాఖ కు చెందిన కీలక నేతలు టిడిపి తీర్ధం పుచ్చుకోడానికి సిద్ధం అయ్యారు. సంక్రాంతి తర్వాత వీరు సైకిలు ఎక్కేస్తారు.

దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కి అనుంగు అనుచరునిగా వ్యవహరించిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను తెలుగుదేశంలోకి తీసుకొచ్చేందుకు మంత్రి అయ్యన్నపాత్రుడు గత కొన్నాళ్లుగా ట్రై చేస్తున్నారు. జగన్ శిబిరంలో కూడా కీలకంగా వ్యవహరించిన కొణతాల గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తలెత్తిన విబేధాలు ముదిరాయి. దీంతో వైసిపికి దూరంగా ఉంటున్న కొణతాల టిడిపిలోకి వస్తే విశాఖ జిల్లాలో పార్టీకి బలమని అయ్యన్న పాత్రడు పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. అయితో విశాఖలో మరో మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెక్ పెట్టడానికి కొణతాలను ఉపయోగించాలనేది అయ్యన్నపాత్రుడి ఆలోచనగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

గత కొన్నాళ్లుగా కొణతాలన రాకను గంటా వర్గం ఏదో రకంగా అడ్డుకుంటూనే ఉంది. తాజాగా కొణతాల ముఖ్యమంత్రితో భేటీ కావడంతో అన్ని ఆటంకాలు తొలగి పోయాయి. సీఎం చంద్రబాబుతో కొణతాల తో పాటూ పెందుర్తి మాజీ ఎం ఎల్ ఎ గండి బాబ్జీ కూడా భేటీ అయ్యారు. మంత్రి అయ్యన్న పాత్రుడు తో పాటూ , ఎపి టిడిపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు కూడా ఈ భేటీలో వున్నారు.

వాస్తవానికి కొణతాల చేరిక అంశం గత శాసనమండలి ఎన్నికల సమయంలో చర్చకు వచ్చింది. ఆయన టీడీపీలోకి రావడానికి ఏర్పాట్లు జరిగాయి. చంద్రబాబు సైతం పచ్చజెండా ఊపారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే గండి బాబ్జీని కూడా చేర్చకోవాలని కొణతాల సూచించడంతో మాజీ మంత్రి, టిడిపి ఎం ఎల్ ఎ బండారు సత్యనారాయణమూర్తి అభ్యంతరం చెప్పారు. దీంతో కొణతాల చేరిక తాత్కాలికంగా ఆగినా, ఇప్పుడు మళ్ళీ తెరమీదికి వచ్చింది.

చంద్రబాబుతో కొణతాల , గండి బాబ్జీ భేటీతో టిడిపిలో చేరిక ఖాయం అయిపొయింది. ఈసందర్భంగా మంత్రి అయ్యన్న పాత్రుడు మాటాడుతూ, సంక్రాంతి తర్వాత పార్టీలో చేరికలు ఉంటాయని, అప్పుడే కొణతాల - గండి చేరతారని చెప్పారు. సిఎమ్ చంద్రబాబు చెప్పాక ఇక ఎవరూ విబేధించరని ఆయన వ్యాఖ్యానించారు.

English summary

Vishkapatnam Ysrcp Leader , Ex- Minister Konathala Ramakrishna to leave Ysr congress party, He is going to join in Telugu desam party (TDP) . Today Konathala Ramkrishna to meets Andhra Pradesh Cheif Minister Chandrababu Naidu on joining in TDP