'అఖిల్‌'తో కొణిదెల డాటర్ రొమాన్స్!!

konidela daughter romancing with Akhil

10:46 AM ON 5th January, 2016 By Mirchi Vilas

konidela daughter romancing with Akhil

మెగా బ్రదర్ నాగబాబు తనయ కొణిదెల నిహారిక ప్రస్తుతం నాగశౌర్య సరసన 'ఒక మనసు' అనే సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా ఘాటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటిస్తుండగానే నిహారిక మరో భారీ అవకాశం దక్కించుకోబోతుంది అని సమాచారం. అక్కినేని నాగార్జున నట వారసుడు అక్కినేని అఖిల్‌ సరసన నిహారిక నటించబోతుందని సమాచారం. 'అఖిల్‌' సినిమా ఫ్లాప్‌ తరువాత ఆచితూచి అడుగులు వేస్తున్న అఖిల్‌ తన తరువాత చిత్రానికి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలు పెట్టేశాడట. అయితే తన కొత్త చిత్రానికి సంబంధించిన విషయాలని త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నాడని సమాచారం.

ఈ చిత్రంలో అఖిల్‌ సరసన నిహారిక నటించే అవకాశాలు ఉన్నాయట. గతంలో వీరిద్దరూ కలిసి ఒక షార్ట్ ఫిలింలో నటించారు. ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌ కూడా షేర్‌ చేసుకుంటే అక్కినేని అభిమానులకి, మెగా ఫ్యామిలీ అభిమానులకి పండుగే అని చెప్పొచ్చు.

English summary

konidela daughter Niharika romancing with Akkineni Akhil.