మెగా డాటర్ బిహేవియర్ పై అప్పుడే రూమర్స్?

Konidela Niharika craze dominating young hero Naga shourya

01:45 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

Konidela Niharika craze dominating young hero Naga shourya

మెగా స్టార్ ఫామిలీ నుంచి ఎందఱో హీరోలు వచ్చారు ... కానీ హీరోయిన్ మాత్రం ఒక్కర్తే వచ్చింది. మెగా ఫామిలీ లోని నాగబాబు డాటర్ నీహారిక హీరోయిన్ గా అరంగేంట్రం చేసి, నటించిన తొలి సినిమా రిలీజ్ కాలేదు... అందుకే ఆమె నటన కు ఎలాంటి స్పందనా లేదు. అయితే.. నీహారిక బిహేవియర్ మీద అప్పుడే రూమర్స్ మొదలైపోయాయి. నాగశౌర్యకు జోడీగా మెగా డాటర్ నటించిన 'ఒక మనసు' చిత్రాన్ని జూన్ 24న రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచింది.

అయితే ఒక మనసు ఫస్ట్ కాపీని సిద్ధం చేసేందుకు యూనిట్ ప్రయత్నిస్తుంటే.. నీహారిక మాత్రం ఇంకా తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు రావడం లేదట. ఆరోగ్యం బాగాలేదని, వేరే పనులు ఉన్నాయని, రికార్డింగ్ డేట్ మార్చమని.. ఇలా రకరకాల కారణాలతో తప్పించుకుంటోందట. అసలు ట్రైలర్ విషయంలోనే ఈ సమస్య వచ్చిందట నిర్మాతలకు. ట్రైలర్ రూపొందించేటపుడు కూడా ఇదే తరహాగా ఇబ్బంది పెట్టిందని అంటున్నారు.

ట్రైలర్ ని ఫైనలైజ్ చేస్తున్న సమయంలో వేరే యాక్టర్ తో డబ్బింగ్ చెప్పించి ఫినిష్ చేయడానికి ప్రొడ్యూసర్ ఫిక్స్ అయినపుడు.. నీహారిక ఆఖరి నిమిషంలో వచ్చిందట. అయితే.. ఆ సమయంలో వేరే ఏం మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోయారని అంటున్నారు. 'మెగాస్టార్ ఎంత ఎత్తుకు ఎదిగినా సామాన్యంగా సింపుల్ గానే ఉంటారు. కానీ ఆయన కుటుంబం నుంచి వచ్చిన ఈమె మాత్రం యువరాణిలా ప్రవర్తించడం బాధాకరం' అనే మాట ఇండస్ట్రీ లో టాక్ హల్ చల్ చేస్తోంది.

ఇది కూడా చూడండి:అక్కడ ఎలుకలతో ఉన్న ప్రసాదాన్ని ఇస్తారట..

ఇది కూడా చూడండి:ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇళయ రాజాను లేపేసిన బావమరిది

ఇది కూడా చూడండి:సెక్సీ యాంకర్ కి సర్జరీ

English summary

Konidela Niharika craze dominating young hero Naga shourya.