శ్రీమంతుడు ఫై   హృతిక్ కన్ను

  Koratala Shiva to direct Hrithik Roshan.

07:12 PM ON 6th November, 2015 By Mirchi Vilas

  Koratala Shiva to direct Hrithik Roshan.

ఇటివల మహేష్ బాబు హీరో గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం శ్రీమంతుడు. తెలుగులో బాహుబలి తరువాత 150 కోట్లతో రెండో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం హిందీలో రీమేక్ అవుతోంది . ఈ చిత్రం తాలుకు హిందీ హక్కులను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది . హిందీ వెర్షన్ లో హీరోగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ న టించబోతున్నాడు. అయితే హృతిక్ ఈ సినిమా లో లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టుగా కొన్ని సన్నీవేశాలని మార్చి కధకి మరికొన్ని ట్విస్ట్ లు జోడిస్తే బాగుంటుందని సూచించాడట . ఈ హిందీ రీమేక్ ను హృతిక్ కొరటాలతో నే తెరకెక్కించాలని నిర్ణయించుకొన్నాడట . అయితే సినిమా క్లైమాక్స్ ను మార్చమని హృతిక్ అన్నట్టు సమాచారం.

కొరటాలను కొన్ని మార్పులతో కధను సిద్దం చెయ్యమని ఫోన్ చేసాడట హృతిక్ . కధకు కొన్ని మార్పులు చెయ్యడానికి కొరటాల ఒప్పుకున్నప్పటికీ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా ఉండడం వలన అది పూర్తయ్యాకా హిందీ శ్రీమంతుడు రీమేక్ గురించి ఆలోచిస్తానని చెప్పినట్టు సమాచారం . హృతిక్ అంత వరకు ఆగుతాడో లేదో వేచి చూడాలి .

English summary

Koratala  Shiva to direct Hrithik Roshan.  Srimanthudu  a biggest block-buster in telugu collected over 150 crores . It is the second highest  collected movie to get after Baahubali  in Telugu Film Industry . This film is going to be remake in hindi . The movie rights were purchased by a corporate film making company.  HrithikRoshan shows interest  to remake this film in hindi .Hrithik asked to add some twists and to change climax of the movie.