'జనతా' పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ  

Koratala Siva gave clarity on Janatha Garage

12:21 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Koratala Siva gave clarity on Janatha Garage

ఒక్కోసారి అంచనాలు తలకిందులవుతాయి కానీ భారీ అంచనాతో కాకుండా మామూలు కోణంలో చూస్తే, అంచనాకు తగ్గట్టే ఉంటుంది. ఇప్పుడు జనతా గ్యారేజ్ డైరెక్టర్ కొరటాల శివ చెప్పేది ఇంచుమించు ఇదే. విషయం ఏమంటే, ఎన్నో అంచనాలు రేకెత్తించిన ‘జనతా గ్యారేజ్‌’ విడుదలైంది. అయితే తారస్థాయిలో ఉన్న అంచనాలు అందుకోవడంలో మాత్రం విఫలమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా విషయంలో అన్ని ప్రాంతాల్లోనూ డివైడ్‌ టాక్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలో కలసి మీడియాతో మాట్లాడాడు. ‘జనతా గ్యారేజ్‌ బ్లాక్‌ బస్టర్‌ కాదు.

అభిమానులకు నచ్చడం వేరు. ప్రేక్షకులకు నచ్చడం వేరు. కానీ, ఇది ఓ క్లాసిక్‌ సినిమా అని మాత్రం చెప్పగలను. ఎన్టీఆర్, మోహన్‌ లాల్‌ కాంబినేషన్‌ లోని అన్ని సీన్లూ బాగున్నాయని అందరూ అంటున్నారు. ఈ సినిమా అభిమానులకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది' అని శివ క్లారిటీ ఇచ్చాడు. పరిశ్రమలోని ప్రముఖులు కూడా తనకు ఫోన్‌ చేసి అభినందిస్తున్నారని, ఓ మంచి సందేశం ఇద్దామన్న ఉద్ధేశంతోనే ఈ కథ రాసినట్టు శివ స్పష్టం చేసాడు.

ఇది కూడా చదవండి: అలాంటి సినిమాలు చూడొద్దంటున్న శృంగార తార!

ఇది కూడా చదవండి: ఫోన్ లో నాన్న ఫొటో పెట్టుకోమంటూ అమ్మకు ట్వీట్

ఇది కూడా చదవండి: శివాజికి తెలుగు తమ్ముళ్లు తలంటేసారు !(వీడియో )

English summary

Koratala Siva gave clarity on Janatha Garage. Director Koratala Siva talks about Janatha Garage movie success.